షాప్‌లోకి వచ్చి స్మార్ట్ గా దొంగతనం చేసిన ఎలుగుబంటి.. వీడియో వైరల్..

విదేశాల్లో అడవుల పక్కనే సిటీలు అవతరిస్తుంటాయి.ఈ చిన్న పట్టణాలకు సమీపంలో ఉండే అడవుల్లో ఎలుగుబంట్లు నివసిస్తుంటాయి.

 The Bear Came Into The Shop And Stole It Smartly.. Video Viral , Bear Shopliftin-TeluguStop.com

అవి ఆహారం కోసం జనావాసాల్లోకి ప్రవేశిస్తుంటాయి.ఆహారం కోసం తరచుగా పట్టణంలో తిరుగుతూ మనుషులకు కూడా ఎదురు పడుతుంటాయి కానీ అవి చాలా సందర్భాల్లో మనుషులపై దాడి చేయవు.

కేవలం ఆహారం కోసమే పాకులాడుతుంటాయి.

అయితే ఇటీవల ఒక ఎలుగుబంటికి( Bear ) బేకరీలోంచి ఏదో కమ్మని వాసన వచ్చింది.ఆ కమ్మటి వాసన ఫాలో అవుతూ అది బేకరీ ని చేరుకుంది.అనంతరం అందులో చాలా ఆహారాలు ఉన్నాయని గమనించింది.

షాప్ లో నుంచి అందరూ వెళ్లిపోయేంతవరకు వేచి చూసి షాపులోకి డోర్ తీసుకొని మరీ ప్రవేశించింది.ఇది ఒక చాక్లెట్( Chocolate ) కేకును లేదా ఏదో బీర్ బాటిల్ లాంటి దానిని చాలా జాగ్రత్తగా తన నోట కరుచుకుంది.

ఆ తర్వాత మనిషి లాగానే వెళ్ళినట్లు డోర్ తీసేసి దర్జాగా బయటికి వెళ్లిపోయింది.దాని సాహసోపేతమైన దోపిడీని సీసీటీవీ కెమెరా చాలా పర్ఫెక్ట్ గా రికార్డ్ చేసింది.

సీసీటీవీ( CCTV )లో రికార్డు కాని విజువల్స్ గురించి కూడా యజమాని వెల్లడించారు.దొంగలించిన ఆహారంతో హాయిగా బయటపడ్డ ఈ ఎలుగుబంటి కార్లు, బైక్‌లను తప్పించుకుంటూ వీధి గుండా పరిగెత్తిందని అన్నారు.షాపులో ఎలాంటి వస్తువులను పాడు చేయలేదని తనకు కావాల్సిందేదో తీసుకొని వెళ్ళిపోయిందని చెప్పుకొచ్చారు.కాగా సీసీటీవీ ఇడియట్స్ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే రెండు లక్షలకు పైగా వ్యూస్, వేలల్లో లైకులు వచ్చాయి.

దీన్ని చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.చాలా స్మార్ట్ గా ఎలుగుబంటి దొంగతనం చేసిందని కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube