వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పార్టీ శ్రేణులను టెన్షన్ పెట్టిస్తున్నారు.ముఖ్యంగా నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు వ్యవహారం ఆ పార్టీలో పెద్ద సంచలనంగానే మారింది.
ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలపై( Sitting MLAs ) పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయాన్ని గుర్తించిన జగన్ సర్వే నివేదికలు, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు.ఎమ్మెల్యేలపై మాత్రమే వ్యతిరేకత ఉందని , ప్రభుత్వ పనితీరుపై ప్రజలలోను అసంతృప్తి ఉందనే విషయాన్ని జగన్ గుర్తించారు.
అందుకే భారీ స్థాయిలో అభ్యర్థుల మార్పుకు శ్రీకారం చుట్టారు.
ఇప్పటికే మూడు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
ఇక ఫైనల్ లిస్టును మరికొద్ది రోజుల్లోనే ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.అయితే మూడు విడతల్లో ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఫైనల్ కాదని , నాలుగో జాబితాలో మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉండవచ్చనే ప్రచారం జరుగుతోండడం వైసిపి అభ్యర్థులు,( YCP Candidates ) ఆశావాహుల్లో మరింత టెన్షన్ పుట్టిస్తుంది.
దీంతో ఫైనల్ జాబితాలో( Final List ) ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయి అనేది వైసిపి కీలక నేతల ద్వారా ఆశావాహులు ఆరా తీస్తున్నారు.
జగన్ టికెట్ కేటాయింపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.ఎక్కడా ఎటువంటి మొహమాటలకు వెళ్లడం లేదు.కచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారికే టికెట్లు( YCP Tickets ) కేటాయింపులు చేస్తున్నారు.
దీంతోపాటు ఆయా నియోజకవర్గల్లో ప్రత్యర్థుల బలాన్ని కూడా అంచనా వేస్తున్నారు.ఆయా పార్టీల నుంచి ఎవరు అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం ఉందో గుర్తించి , సామాజిక సమీకరణాలను లెక్కలు వేసుకుని అభ్యర్థుల ఎంపిక చేపడుతున్నారు.
ఈ టిక్కెట్ల ప్రక్షాళన విషయంలో జగన్ కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో, చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరకడం లేదు.దీంతో చాలామంది వైసిపిని( YCP ) వీడేందుకు సిద్ధమవుతున్నా.జగన్ మాత్రం లెక్క చేయడం లేదు.నాలుగో విడత అభ్యర్థుల జాబితా ప్రకటించబోతున్నారు.అదే ఫైనల్ లిస్ట్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వైసిపి నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంది.