ఉప్పెన సినిమాతో బేబమ్మగా కుర్రాళ్ళ హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి.ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారి మంచి గుర్తింపు అందుకుంది.
పైగా స్టార్ హీరోల దృష్టిలో కూడా పడింది.తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.
తన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై బాలనటిగా అడుగుపెట్టి ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటించింది.
దీంతో ఈ అమ్మడి తన క్రేజ్ ను ఏకంగా హీరోయిన్ వరకు సంపాదించుకుంది.అంతేకాకుండా కొన్ని సీరియల్ ప్రకటనలో, జువెలరీ ప్రకటనలో కూడా మెరిసింది.
గత కొన్ని రోజుల నుండి వరుస సినిమాలలో అవకాశాలు అందుకుందో టాప్ పొజిషన్ కి ఎదిగింది.
చిన్న వయసులోనే హీరోయిన్ గా పరిచయమై మంచి క్రేజ్ తో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ నిత్యం ఏదో ఒక పోస్టు తో బాగా హల్ చల్ చేస్తుంది.సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఫోటో షూట్ లంటూ తెగ సందడి చేస్తుంది.ఇక ఈ అమ్మడు తన ఇన్ స్టా లో కూడా ఏదో ఒక పోస్ట్ తో అందరి దృష్టిలో పడుతుంది.
తన వ్యక్తిగత విషయాలను, డాన్స్ వీడియో లను బాగా షేర్ చేసుకుంటుంది.తన ఇన్ స్టాలో ఏదైనా వీడియో షేర్ చేసుకోగా ఆ వీడియో క్షణాల్లో వైరల్ అవుతుంది.
ఇదంతా పక్కన పెడితే.కృతి శెట్టి ఈ మధ్య వరుసగా ప్లాఫ్ అందుకోవటంతో తనకు ఒక మచ్చ ఏర్పడింది.పైగా మరో సీనియర్ హీరోయిన్ తో పోలుస్తూ టార్గెట్ చేశారు నెటిజన్లు.ఇక ఆ సీనియర్ హీరోయిన్ తో పాటు తనకు కూడా ఒక పేరు పెట్టేశారు.
ఇంతకూ ఆ సీనియర్ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా.ఆమె ఎవరో కాదు పూజ హెగ్డే.
కెరీర్ మొదట్లో మంచి సక్సెస్ లో అందుకున్న పూజ హెగ్డే ఇటీవలే తను నటించిన వరుస సినిమాలలో ఫ్లాప్ సొంతం చేసుకోవడంతో తనది ఐరన్ లెగ్ అంటూ పేరు పెట్టేశారు.ఇక కృతి శెట్టి పరిస్థితి కూడా అలాగే మారింది.
దీంతో తనకు కూడా ఐరన్ లెగ్ అంటూ పేరు పెట్టేశారు.ఈ ఇద్దరు హీరోయిన్ ల ఫోటోలను ఒకే దగ్గర పెట్టి ఇద్దరు ఐరన్ లెగ్గు అన్నట్లు మీమ్స్ క్రియేట్ చేసి బాగా వైరల్ గా మారుస్తున్నారు.
అది చూసిన తమ అభిమానులు.వీళ్ళని ఎందుకు ఐరన్ లెగ్స్ అంటున్నారు.అసలు సినిమా తీసినోడిని అనాలి కాని.వీరిని అంటే ఏం లాభం అంటూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఈ మీమ్ వైరల్ కాగా దీని గురించి కృతి శెట్టి తో పాటు పూజ హెగ్డే కూడా ఏమని స్పందిస్తుందో చూడాలి.