1.ఎన్.ఆర్.ఐ డాక్టర్ మృతదేహం లభ్యం

నల్గొండ జిల్లాలోని మెళ్ల దుప్పల్లి వ్యవసాయ క్షేత్రంలో అదృశ్యమైన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి బంధువైన ఎన్నారై డాక్టర్ జయసీల్ రెడ్డి (42 ) మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.నల్గొండ జిల్లా మేళ దుప్పలపల్లి చెరువులో మృతదేహం లభ్యమైంది.
2.వలసదారులు జీతాల్లో కువైట్ కోత
కువైట్ లో భారీ జీతాలు ఉన్న వలసదారులకు వర్క్ పర్మిట్లు ఇవ్వకూడదనే ఆలోచనలో అక్కడి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
3.ప్రవాస పిల్లల విషయంలో కువైట్ సంచలన నిర్ణయం

కరోనా వాక్సిన్ వేయించుకొని 18 ఏళ్ల ప్రవాసీయుల పిల్లల విషయంలో గల్ఫ్ దేశం కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది.వాక్సిన్ తీసుకోని 18 ఏళ్ల లోపు పిల్లలు తిరిగి కువైట్ రావచ్చని ప్రకటించింది.
4.ఫ్లోరిడా లో కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడా లో ఓ వ్యక్తి ఉన్మదిలా ప్రవర్తించి కాల్పులకు దిగడంతో మూడు నెలల చిన్నారి, ఆమె తల్లి మృతి చెందారు.
5.కువైట్ లో ఇండియన్ ఎంబసీ కీలక నిర్ణయం
కువైట్ లోని భారత రాయబార కార్యాలయం నీట్ 2021 పరీక్ష సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.పరీక్ష జరిగే ఈ నెల 9, 12 తేదీల్లో అన్ని పబ్లిక్ సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించింది.
6.కెనడా ప్రధానిపై రాళ్ల దాడి

కెనడాలో నిరసన కారులు రెచ్చిపోయారు.ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో పై రాళ్ల దాడి చేశారు.ఈ ఘటనలో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు.
7.యూఎన్ ఉగ్రవాది కాబోయే ఆఫ్ఘన్ ప్రధాని
ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబన్లు సర్వం సిద్ధం చేసుకున్నారు.ప్రధానిగా తాలిబన్ నేత ముల్లా మొహ్మద్ బాధ్యతలు చేపట్టనున్నారు.ఇతడు ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు.
8.ఇండియాలో టెస్లా కార్ల షోరూమ్స్

అమెరికా ఆధారిత ఎలక్ట్రిక్ కార్ మేకర్ టెస్లా భారత మార్కెట్ లో నేరుగా కార్ల అమ్మకాల కు ప్లాన్ చేస్తోంది.ఈ మేరకు ఇండియాలో టెస్లా కార్ల షోరూమ్స్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
9.గల్ఫ్ దేశాల్లో కరోనా తగ్గుముఖం
గల్ఫ్ దేశాల్లో కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది.దీంతో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.
10.కాబూల్ లో పాక్ వ్యతిరేక ర్యాలీలు

పాకిస్థాన్ .ఆఫ్ఘన్ నుంచి వెళ్ళిపో .‘మాకు స్వయం పాలిత దేశం కావాలి ‘ .మాకు పాకిస్థాన్ తోలు బొమ్మ ప్రభుత్వం వద్దు అంటూ పెద్ద ఎత్తున మహిళలు వీదుల్లో నిరసనలకు దిగారు.దీంతో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు.