1.నాట్స్ సరికొత్త కార్యక్రమం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం వినూత్న కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.ఇంట్లో పిల్లలు వాడే ఎలక్ట్రానిక్ పరికరాలను చెత్త బుట్టలో పడకుండా శరణార్థుల పిల్లలకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.” డోంట్ డిచ్ ఇట్, డొనేట్ ఇట్ ” అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.
2.సముద్రంలో మునిగి భారతీయ వ్యక్తి మృతి
షార్జాలో ని హమ్రియా సముద్రంలో ఈతకు వెళ్లిన 24ఏళ్ల భారతీయ యువకుడు ఎమిల్ (24) పుజి రహాలోని సముద్రంలో స్నానం చేస్తూ నీట మునిగి మరణించాడు.మృతుడుది కేరళ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని గురువాయూర్.
3.పెరిగిన విమాన టికెట్ల ధరలు
గల్ఫ్ దేశం కువైట్ లో విమాన చార్జీలు భారీగా పెరిగాయి.కొన్ని రూట్ల లో విమాన టిక్కెట్ల ధరలు 70 నుంచి 150 శాతం వరకు పెరిగాయి.
4.ఐదు శాతం పెరిగిన వలసదారుల లావాదేవీలు
సౌదీ సెంట్రల్ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం సౌదీ అరేబియాలోని వ్యక్తిగత చెల్లింపులు మార్చిలో 5 శాతం పెరిగాయి.
5.అమెరికా వర్క్ పర్మిట్ల గడువు పొడగింపు
భారత్ నుంచి వచ్చే వారితో సహా వలసదారులకు ఊరట ఇచ్చే విధంగా అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.వలసదారుల వర్క్ పర్మిట్ ను 18 నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
6.భారత వ్యక్తి కి 25 కోట్ల జాక్ పాట్
Ajwain లో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసే ఓ భారతీయుడికి ఈ ఏడాది ఈద్-ఉల్-ఫితర్ బాగా కలిసి వచ్చింది.భారత్ కు చెందిన ముజబ్ చిరతోడి (40) 12 మిలియన్ దిర్హంస్ ( భారత కరెన్సీలో 24.93 కోట్లు ) గెలుచుకున్నాడు.
7.ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణ కు కీలక బాధ్యతలు
ఐబీఎం చైర్మన్ సీఈవో అరవింద్ కృష్ణ కీలక బాధ్యతలు దక్కాయి.ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా నియమితులయ్యారు.
8.ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలంటూ సంతకాల సేకరణ
అమర గాయకుడు , ప్రముఖ సంగీత దర్శకుడు , స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు భారత రత్న ఇవ్వాలనే నినాదం తో యూ ఎస్ ఏ నుంచి శంకర నేత్రలాయ యూ ఎస్ ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 90కి పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు సంస్థలను ఏకతాటి పైకి తెస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.