అగ్ర రాజ్యంలో తెలుగు వెలుగు...అక్కడి బడిలో తెలుగులో ప్రకటన...

తెలుగు వారందరికీ తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం అది సహజమే మాత్రు భాష అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ తెలుగు భాష అంటే కేవలం తెలుగు వారికీ మాత్రమే కాదు చాలా రాష్ట్రాలు, దేశాల వారికి కూడా ఎంతో ఇష్టం గౌరవం.అందుకే దేశ భాషలందు తెలుగు లెస్సా అంటారు.

 Telugu Notification In America Lawrence High School, America Lawrence High Schoo-TeluguStop.com

కానీ మన తెలుగు రాష్ట్రంలో ప్రకటనలు, నోటీసులు, మీటింగ్ లు అన్నీ తెలుగు లోనే ఉండాలనే నిభందన ఉన్నా ఒక్కరూ పాటించరు.తెలుగులో మాట్లాడితే అదేదో బూతులు మాట్లాడుతున్నట్టుగా భావించే మేధావులు కూడా లేకపోలేదు.

అయితే దేశం కాని దేశం, మన భాష తో సంభంధం లేకపోయినా అక్కడ మాత్రం మన తెలుగు వెలిగిపోతోంది.

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రానికి చెందిన కౌంటీలోని లారెన్స్ టౌన్ షిప్ బడిలో తెలుగులో ప్రకటన చూసిన అక్కడి తెలుగు వారు ఆశ్చర్యానికి లోనయ్యారు.

అమెరికాలో మొట్టమొదటి సారిగా ఓ స్కూల్ లో ఇలా తెలుగు ప్రకటన చూసామంటూ సంబరపడిపోతున్నారు.ఇంతకీ తెలుగులో వారు ప్రకటన ఎందుకు ఇచ్చారు, ఆ ప్రకటన సారాంశం ఏంటంటే.

సదరు లారెన్స్ స్కూల్ లో ఇద్దరు పిల్లలకు కరోన సోకింది అలాగే సంస్థ ఇంటర్మీడియట్ విద్యార్ధులు ముగ్గురికి కరోనా సోకింది, అలాగే స్లాక్ ఫుడ్ స్కూల్ లో ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది దాంతో స్కూల్ యాజమాన్యం తల్లి తండ్రులకు ఈ విషయాన్ని తెలుపుతూ నోటీసు బోర్డులో ఈ ప్రకటన పెట్టింది.

స్కూల్ పిల్లలకు వైద్య సదుపాయాలు అందిస్తున్నామని తల్లి తండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

లారెన్స్ టౌన్ షిప్ లో దాదాపు 7 స్కూల్ వరకూ ఉండగా అన్నిటిలో కలిపి మైనారిటీ విద్యార్ధులు ఉన్నారని వారిలో భారత సంతతికి చెందిన వారు అలాగే తెలుగు వారి పిల్లలు ఉండటంతో ఈ ప్రకటన ఇవ్వాల్సి వచ్చిందని స్కూల్ యాజమాన్యం తెలిపింది.అమెరికాలోని న్యూజెర్సీ టెక్సాస్ లలో తెలుగు వారు అత్యధికంగా ఉంటారు.

దాంతో ఈ ప్రకటన అక్కడి మన తెలుగు వారిని ఎంతో అలరించింది.తెలుగులో ప్రకటన చూసి చాలా సంతోష పడ్డామని తెలుగు కుటుంబాలు ఆనందం వ్యక్తం చేసాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube