అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయ నిపుణులకు కొదవే ఉండదు.వివిధ దేశాల నుంచీ అమెరికాకు వలసలు వెళ్లే వారిలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
వలస దారులుగా అక్కడికి వెళ్ళినా మన వారు అత్యున్నత ప్రతిభతో అక్కడ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అయితే కొందరు మాత్రం ఆ దేశం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నారు.
అమెరికా ప్రభుత్వాన్ని మోసం చేసి అడ్డంగా దొరికిపోయి జైలు జీవితం అనుభవిస్తున్న ఇండో అమెరికన్స్ ఎంతో మంది ఉన్నారు.తాజాగా
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ఇండో అమెరికన్ కావూరు కిషోర్ కుమార్ కు అమెరికా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన కేసులో 15 నెలల జైలు జీవితంతో పాటు సుమారు రూ.4 కోట్లు భారీ జరిమానా విధించారు.2018 లో ఇమ్మిగ్రేషన్ కు సంభందించి భారీ అవినీతి చేసి ప్రభుత్వానికి నష్టాన్ని తీసుకువచ్చారు అనే అభియోగాలతో ఆయనపై కేసు నమోదయ్యింది.కిషోర్ కుమార్ అమెరికాలో సుమారు 4 కన్సల్టెన్సీ లను నడుపుతున్నారు.వీటి ద్వారా భారతీయులను అమెరికాకు ఉద్యోగాల నిమ్మిత్తం తీసుకువచ్చేవారు.ఈ క్రమంలోనే
2009 -17 అంటే 8 ఏళ్ళ మధ్య కాలంలో సుమారు 4 కన్సల్టెన్సీల ద్వారా దాదాపు 700 మందిని అమెరికా తీసుకువెళ్ళారు.అయితే వీరిలో చాలామందికి ఉద్యోగాలు లేకపోయినా ఉన్నట్టుగా చూపించి అమెరికా తీసుకువచ్చారు, ఆ తరువాత ఉద్యోగ ఏర్పాట్లు చేశారు.అమెరికా రూల్స్ ప్రకారం. హెచ్-1బి వీసా ద్వారా ఎవరు అమెరికా వచ్చినా వారికి తప్పనిసరిగా ఉద్యోగం ఉండాల్సిందే.లేదంటే అమెరికా వచ్చేందుకు అనుమతులు ఉండవు.ఇవన్నీ తెలిసి కిషోర్ కుమార్ కావాలనే అమెరికా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాడని అభియోగంతో అతడికి 15 నెలల జైలు శిక్షతో పాటు రూ.4 కోట్లు భారీ జరిమానా విధించింది కాలిఫోర్నియా కోర్టు.