తెలుగు సినిమా ఇండస్ట్రీ కి రెడ్డి సామజిక వర్గానికి వీడిపోని అనుబంధం ఉంటుంది.దాదాపు అందరు తెలుగు హీరోలు గత కొన్నేళ్లుగా పని గట్టుకొని రెడ్డి సామజిక వర్గానికి చెందిన అమ్మాయిలను ప్రేమించి లేదా పెద్దలు చూడగా వివాహం చేసుకొని మూడు మూళ్ళ బంధం తో ఒక్కటవుతున్నారు.
ఇదేమి ఈ మధ్య కాలం లో కొత్తగా జరగటం లేదు.ఒక దశాబ్ద కాలం గా ఇదే తంతు కొనసాగుతుంది.
ఇక నిన్నటికి నిన్న శర్వానంద్( Sharwanand ) కూడా రక్షిత రెడ్డి( Rakshita Reddy ) అనే అమ్మాయితో పెళ్లి బంధం తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాడు.శర్వానంద్ పెళ్లి తర్వాత చాల మంది టాలీవుడ్ హీరోలు అంతా కూడా పని గట్టుకొని ఎందుకు రెడ్డి అమ్మాయి లను పెళ్లి చేసుకుంటున్నారు అనే చర్చ కొనసాగిస్తున్నారు.
దీని పై సోషల్ మీడియా లో కూడా చాల పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఇంతకు ముందు rx 100 హీరో కార్తికేయ లోహిత రెడ్డి( Karthikeya Lohitha Reddy ) అనే అమ్మాయిని వివాహం చేసుకోగా, మంచు విష్ణు ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి వైస్ జగన్ సోదరి వెరోనికా రెడ్డి ని( Veronica Reddy ) వివాహం చేసుకున్నాడు.అయన సోదరుడు మంచు మనోజ్ సైతం ప్రణతి రెడ్డి అనే అమ్మాయి ని ప్రేమించి పెళ్లి చేసుకోగా ప్రస్తుతం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.మంచు మనోజ్ రెండో వివాహం కూడా భూమా మౌనిక రెడ్డి తో( Bhuma Mounika Reddy ) కావడం విశేషం.
ఇక చాల ఏళ్ళ క్రితమే అల్లు అర్జున్ సైతం స్నేహ రెడ్డి ని పెళ్లటగా వీరికి ఇప్పుడు ఇద్దరు సంతానం.అక్కినేని హీరో సుమంత్ సైతం కీర్తి రెడ్డి అనే హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నాళ్ళకు విడిపోయాడు.

ఇక తెలంగాణ హీరో నితిన్ షాలిని రెడ్డి అనే అమ్మాయిని మొన్న ఆ మధ్య పెళ్లి చేసుకున్నాడు.ఇక మెగా ఫామిలీ హీరో రామ్ చరణ్ సైతం అపోలో సంస్థల ఛైర్మెన్ ప్రతాప్ రెడీ మనవరాలిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక బ్రహ్మానందం పెద్ద కుమారుడు రాజ్ గౌతమ్ సైతం రెడ్డి సామజిక వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.అక్కినేనిని నాగార్జున కోడలు యార్లగడ్డ సుప్రియ చరణ్ రెడ్డి అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఇతడు ప్రస్తుతం చనిపోయాడు.ఇలా చాల మంది హీరోలు రెడ్డి అమ్మాయిలపై మనసు పారేసుకుంటున్నారు.