తెలుగు బిగ్ బాస్ లో సామాన్య వ్యక్తి గా ఎంట్రీ ఇచ్చిన ఉడాల్ మామ అలియాస్ ఆది రెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.ఈయన గురించి చాలా మందికి తెలియక పోవచ్చు.
ఈయన యూట్యూబ్ లో బిగ్ బాస్ గురించి రివ్యూలు ఇస్తూ ఉండే వాడు రివ్యూ లతో పాటు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు.ఎవరు ఎలా ఆడుతున్నారు అనే విషయాన్ని చాలా చక్కగా విశ్లేషించి ప్రేక్షకుల యొక్క అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
తనకు తానుగా ఉడాల్ మామ అనే పేరుని పెట్టుకున్న ఆది రెడ్డి అనూహ్యం గా ఈ సీజన్ బిగ్ బాస్ లో సామాన్య కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
సామాన్యుడు కనుక ఒక రెండు వారాలు మూడు వారాలు ఉంటాడు అని అంతా అనుకున్నారు.
కానీ ఈయన తీరును చూస్తుంటే కనీసం ఏడు ఎనిమిది వారాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఫైనల్ 5 వరకు ఉన్నా కూడా ఆశ్చర్యం లేదంటే చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆది రెడ్డి తీరును చూస్తుంటే చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు.కొందరు ఆయన ఆట సింహంలా ఆడుతున్నాడు అంటే మరి కొందరు గుంట నక్కల వ్యవహరిస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు.
పాజిటివ్ లేదా నెగటివ్ ఎలా కామెంట్స్ వచ్చినా కూడా ఆది రెడ్డి గురించి జనాలు ఆలోచిస్తున్నారు.ఆది రెడ్డి గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు.

అనేది మాత్రం స్పష్టం అలా మాట్లాడుకోవడం లేదా అలా చర్చించుకోవడం వల్ల ఖచ్చితంగా ఆది రెడ్డి గురించి పాజిటివ్ ఓట్లు పడే అవకాశం ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.తప్పకుండా బిగ్బాస్ లో ఆది రెడ్డి ఈ సారి ఒకసారి కొత్త సంచలనంగా నిలిచే అవకాశం ఉందంటూ ప్రస్తుతం బిగ్ బాస్ రివ్యూ ఇస్తున్న వారు కొందరు అంటున్నారు.