తెలంగాణలో టానిక్ లిక్కర్ ( Tonique liqueur )వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారంపై ఇప్పటికే విచారణ జరుగుతుండగా టానిక్ వైన్ షాపుకు ఎక్సైజ్ శాఖ భారీ షాక్ ఇచ్చింది.
గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును ఎక్సైజ్ అధికారులు బ్రేక్ చేశారు.ఈ నేపథ్యంలో టానిక్ నిర్వాహకులను ఎక్సైజ్ శాఖ నోటీసులు( Excise Department Notices ) అందజేశారు.
అయితే టానిక్ లిక్కర్ దుకాణాలు అర్ధరాత్రి 2 గంటల వరకు నిర్వహించుకునే విధంగా గత ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటును కల్పిస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.తాజాగా టానిక్ షాప్ సమయాలను ఎక్సైజ్ శాఖ అధికారులు కుదించారు.
ఈ మేరకు మద్యం షాపులను రాత్రి 11 గంటలకు మూసివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.