తెలంగాణ ఎన్నికల్లో దూకుడుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి ,( BJP ) కాంగ్రెస్ లకు( Congress ) కొన్ని కొన్ని అంశాలు ఇబ్బందికరంగా మారాయి.బీఆర్ఎస్ పై పట్టు సాధించే క్రమంలో సొంతంగా కొన్ని హామీలను ప్రకటించే విషయంలో బిజెపి , కాంగ్రెస్ నేతలు దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు.
ఏ విషయంపైనైనా ఢిల్లీలోని అధిష్టానం పెద్దలే( Delhi Leaders ) నిర్ణయాలు తీసుకోవాల్సి రావడంతో, వీరు సొంతంగా ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
దీంతో రెండు పార్టీల నేతలలోను కాస్త అసంతృప్తి కనిపిస్తోంది.
కొన్ని అంశాలను మేనిఫెస్టోలో( Manifesto ) చేర్చే విషయంలోనూ , స్థానిక సమస్యలను తీర్చుతామని హామీ ఇచ్చే విషయంలోనూ సొంతంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఇటు బిజెపి , అటు కాంగ్రెస్ నేతల్లో నెలకొంది.ఇతర పార్టీల కు చెందిన కీలక నేతలను పార్టీలో చేర్చుకోవాలన్నా, సొంత పార్టీలోని నేతలు అసంతృప్తి తో బయటకు వెళ్లకుండా వారికి హామీలు ఇచ్చే విషయంలో ఢిల్లీ పెద్దల అనుమతి లేకుండా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉండడంతో ,

కాస్త ఇబ్బంది పరిస్థితులను రెండు పార్టీల నేతలు ఎదుర్కొంటున్నారు.ప్రతిదానికి అధిష్టానం పెద్దలే చూసుకుంటారనే ధోరణితో తెలంగాణ బిజెపి , కాంగ్రెస్ నేతలు ఉండడం బీఆర్ఎస్ కు ( BRS ) సానుకూలంగా మారింది.బిజెపి కాంగ్రెస్ నేతలు అధిష్టానం పెద్దలు సూచించిన మేరకే ముందుకు వెళ్లడం మినహా అప్పటికప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజల్లో వాటిని ప్రకటించే అవకాశం లేకపోవడం తో అనుకున్న స్థాయిలో ప్రజల నుంచి స్పందన రావడం లేదని ఈ రెండు పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల కాలంలో ఈ రెండు పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు చూస్తే అన్నిటికి అధిష్టానం పెద్దల ప్రభావం కనిపిస్తుంది తప్ప, రాష్ట్ర నాయకులు ప్రభావం ఏమాత్రం లేకపోవడం పై బీ ఆర్ ఎస్ నేతలు సైతం అనేక వ్యంగ్య విమర్శలు చేస్తున్నారు.ప్రజా సమస్యల విషయంలోనే కాకుండా , పార్టీకి సంబంధించిన విషయాలపై నిర్ణయం తీసుకునే విషయంలోనూ ఇదే రకమైన పరిస్థితి ఏర్పడడంతో ఢిల్లీ నిర్ణయాలపై ఈ రెండు పార్టీల్లోనూ ఏదో తెలియని అసంతృప్తి అయితే స్పష్టంగా కనిపిస్తోంది.