తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇలాంటి క్రమం లోనే ఈ సంక్రాంతికి హనుమాన్ ( Hanuman )సినిమా రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించింది.
ఇక ఈ సినిమా కోసం హీరో తేజ సజ్జా చాలా కష్టపడినట్టుగా రీసెంట్ గా సక్సెస్ మీట్ లో తెలియజేశాడు.
అయితే ఆయన కంట్లో దుమ్ము, ధూళి పడటం వల్ల కంటి చూపును కూడా కోల్పోయినట్లు గా తెలియజేశారు.ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేసిన హనుమాన్ సినిమా ప్రస్తుతం మంచి సక్సెస్ ను అందుకుంది.తన కష్టానికి ఫలితం దక్కిందంటు చాలామంది సినీ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇంకా ఇప్పటికే ఆయనకి స్టార్ డైరెక్టర్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది.ఇక ఇప్పుడు రీసెంట్ గా తెలుస్తున్న విషయం ఏంటంటే తేజ సజ్జా చిరంజీవి హీరో గా వస్తున్న విశ్వం భర సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
తేజ సజ్జాకి చిరంజీవి( Chiranjeevi )కి మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం మనకు తెలిసిందే.అందువల్ల చిరంజీవి కూడా ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కి వచ్చి వాళ్ళని ఆశీర్వదించారు.
ఇక ఆ ఈవెంట్ లో చిరంజీవి చెప్పినట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది.ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి చేస్తున్న విశ్వంభర సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఒక యంగ్ హీరో అయితే బాగుంటుందని డైరెక్టర్ వశిష్ట అనుకోవడంతో ఆ క్యారెక్టర్ కోసం తేజ సజ్జా ని సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.ఆ క్యారెక్టర్ సినిమాలో ఇంపార్టెంట్ పాత్రను పోషించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…చూడాలి మరి తేజ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ పొందుతాడు అనేది…
.