వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జక్కంపూడి కాలనీలో మాజీ సీఎం చంద్రబాబు హయంలో కట్టిన టిడ్కో ఇళ్లను వెంటనే పేద ప్రజలకు అందివ్వాలని మండిపడ్డారు.
ప్రస్తుతం టిడ్కో ఇళ్లు ఉన్న ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలతో పాటు గంజాయి, బ్లేడ్ బ్యాచ్ నిర్వహించే కార్యక్రమాలకు అడ్డాగా నిలుస్తున్నాయని ఆరోపించారు.ఇప్పటికైనా వైసీపీ సర్కార్ ప్రభుత్వం స్పందించి టిడ్కొ ఇళ్లను వెంటనే పేద ప్రజలకు అందివ్వాలని నిరసన దీక్ష చేపట్టారు.