తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.ప్రధాన పార్టీలైన బీఆర్ ఎస్, బిజెపి, కాంగ్రెస్ ( BRS BJP Congress )లు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి .
అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ హడావుడి చేస్తున్నాయి.అయితే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంలో తెలంగాణ టిడిపి మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉంది.
ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే మంచిదనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లో కనిపిస్తున్నాయి.చాలా రోజుల క్రితమే ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ , కాంగ్రెస్ , బిజెపిలు ఎన్నికల కసరత్తు మొదలుపెట్టినా, టిడిపి మాత్రం సైలెంట్ గానే ఉంది.
బీ ఆర్ ఎస్, కాంగ్రెస్( BRS BJP Congress ) అభ్యర్థులను ప్రకటించగా, బిజెపి అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది. కానీ తెలంగాణ టిడిపిలో మాత్రం ఇంకా ఆ హడావుడి కనిపించడం లేదు.
అసలు పోటీ చేయడమా లేక ఏదైనా పార్టీకి మద్దతు ఇవ్వడమా అనే విషయంలో ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉంది.తెలంగాణలో టిడిపి పోటీ చేస్తే అది కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండిపడుతుందని, అనూహ్యంగా బిఆర్ఎస్ కు మేలు జరుగుతుందనే అంచనాలో ఉంది .అంతే కాకుండా బిజెపి ఎన్నికల్లో జనసేన, టిడిపి మద్దతును పరోక్షంగా కోరుతోంది .ఇటీవల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) అమిత్ షాను కలిశారు.అనంతరం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి( G.Kishan Reddy )తోను భేటీ అయ్యారు. దీంతో టిడిపి బిజెపికి మద్దతు ఇస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది.తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడనమా లేక బీజేపీకి మద్దతు పలకడమా అనేది తేల్చుకోలేక పోతుంది.
ఎవరికి మద్దతు ఇవ్వకుండా , పోటీ చేయకుండా సైలెంట్ గా ఉంటే కాంగ్రెస్ కు లబ్ధి కలుగుతుందని అంచనా వేస్తోంది.ఈ విషయంలో టిడిపి అధిష్టానం ఏ నిర్ణయం ప్రకటించడం లేదు .కానీ తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ( TDP Kasani Gnaneshwar )మాత్రం ఎన్నికల్లో పోటీచేయాలనే పట్టుదలతో ఉన్నారు.అభ్యర్థుల ఎంపిక పైన ఇప్పటికే కసరత్తు చేశారు.
కానీ అటు లోకేష్ గాని ,ఇటు తెలంగాణ టిడిపి బాధ్యతలు చూస్తున్న బాలకృష్ణ గానీ ఈ విషయంలో సైలెంట్ గా ఉండడం, అధినేత నిర్ణయం ఏమిటి అనేది క్లారిటీ లేకపోవడంతో ఈ విషయంలో ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో తెలంగాణ టిడిపి ఉంది.