వైసీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే లపై టీడీపీ ఫోకస్ ?  నేడు నిర్ణయం 

ఇటీవల ఏపీ అధికార పార్టీ వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలపై టిడిపి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.ముఖ్యంగా వైసిపి నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేల విషయంలో టిడిపి ఆసక్తి చూపిస్తోంది.

 Tdp Focus On Mla Suspended By Ycp? Decision Today Jagan, Tdp, Telugudesam, Cbn,-TeluguStop.com

ఈ మేరకు ఈరోజు ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.పార్టీకి సంబంధించిన అనేక కీలక నిర్ణయాలతో పాటు,  వైసిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్, ఆ తరువాత ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల పైన పొలిట్ బ్యూరోలో కీలకంగా చర్చిస్తున్నారు .ముఖ్యంగా వైసిపి ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో చోటుచేసుకున్న పరిణామాలు, టిడిపి మహానాడు,  ఎమ్మెల్సీ ఎన్నికల్లో( MLC electionS ) టిడిపి అభ్యర్థుల విజయాలు,  సస్పెండ్ అయిన వైసిపి ఎమ్మెల్యేల విషయంలో ఏం చేయాలి అనే అనేక కీలక అంశాలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో పొలిట్ బ్యూరో లో చర్చిస్తున్నారు.దీంతోపాటు 41 ఏళ్ల టిడిపి ప్రస్థానం, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల పైన చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.

మరీ ముఖ్యంగా టిడిపి పోలిట్ బ్యూరో( TDP ) లో ప్రధానంగా ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి అనుకూలంగా ఓటు వేసిన వైసిపి ఎమ్మెల్యేల విషయంపై చర్చించబోతున్నారట.

 వీరి విషయంలో ఏం చేయాలి వారిని పార్టీలో చేర్చుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది.

ఒకవేళ వారిని పార్టీలో చేర్చుకుని టిడిపి టికెట్ ఇస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇలా  అనేక అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా టిడిపి వర్గాలు చెబుతున్నాయి.అలాగే ఈ ఏడాది మహానాడు ను రాజమండ్రిలో నిర్వహించేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారట.

దీంతోపాటు రాబోయే ఎన్నికల్లో పొత్తుల అంశం పైన ప్రధానంగా చర్చించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Telugu Ap, Chandrababu, Jagan, Tdp Polit Buro, Telugudesam, Ysrcpsuspended-Polit

 వైసీపీ( YCP ) నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు టిడిపి వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉండడంతో, వారిని చేర్చుకునే ముందు ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ క్యాడర్ తో చర్చించి, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట.ఈ అంశాల పైన నేడు క్లారిటీ రాబోతోంది.అలాగే ఈ నలుగురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్లే ఆలోచన వైసిపి ప్రభుత్వం చేస్తే అప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనే దానిపైన నేటి సమావేశంలో చర్చించబోతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube