బిజెపి -టిడిపి పొత్తు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి?

వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సారధ్యంలోని ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) కూడా భాగస్వామి అవుతుందని గత కొన్ని రోజులుగా తెలుగు మీడియా లో వార్తా కథనాలు వస్తున్నాయి.2014 ఎన్నికల్లో భాజాపా తో కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు వెళ్ళిన తెలుగుదేశం మంచి ఫలితాలను అందుకుంది .ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది .అయితే తదనంతర పరిణామాలతో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్టుగా ప్రకటించి బిజెపితో దూరం పెంచుకున్నారు .2019 ఎన్నికలకు సింగిల్గానే పార్టీలన్నీ పోటీ చేశాయి దాంతో ఏకపక్షంగా వైసిపి అధికారంలోకి వచ్చింది .దాదాపు 151 సీట్ల భారీ మెజారిటీని కూడా దక్కించుకుంది .

 Tdp Chandrababu Naidu Alliance With Bjp,bjp,tdp,chandrababu Naidu,ap Politics,al-TeluguStop.com
Telugu Alliance, Ap, Chandrababu-Politics

దాంతో తత్వం బోధపడిన చంద్రబాబు( Chandrababu Naidu ) మరొకసారి పొత్తు రాజకీయాలకు తెర తీశారు.జనసేనతో పొత్తును దాదాపు ఫైనల్ చేసుకున్న చంద్రబాబు జాతీయ పార్టీ అయిన బిజెపిని కలుపుకోవడానికి అనేక విదాలుగా ప్రయత్నించారు .అయితే చంద్రబాబు నమ్మదగిన మిత్రుడు కాదని బావించిన భాజపా( BJP ) ఆచి తూచి స్పందించింది .తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం అవసరం ఉంటుందని తెలుగుదేశం సాంప్రదాయక ఓటింగ్ తెలంగాణలో ఇప్పటికి సజీవంగా ఉందని భావిస్తున్న భాజపా తెలంగాణ వరకూ తెలుగుదేశం మద్దతు తీసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున ఆచితూచి స్పందినస్తున్నట్టుగా తెలుస్తుంది .మరోసారి భారీ మెజారిటీ వస్తే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కూడా వేలు పెడతారని ఇది తమకు ఇబ్బందికరమని భావిస్తున్న భాజపా పొత్తుపై త్వరపడడం లేదని సమాచారం.

Telugu Alliance, Ap, Chandrababu-Politics

మరోవైపు నిన్న మొన్నటి వరకు భాజాపాతో పొత్తుకు తహతహ లాడిన చంద్రబాబు కూడా యూటర్న్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.ఒకదాని వెంట ఒకటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న భాజాపా పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెల్లుబుకుతుందని ఇప్పుడు ఆ పార్టీతో అంట కాగితే ఆ ప్రభావం తాము పైన ఎక్కడ పడుతుందో అన్న భయం కూడా ఇప్పుడు చంద్రబాబులో కలుగుతున్నట్లుగా తెలుస్తుంది .అంతేకాక ముస్లింల వ్యతిరేక బిల్లుగా ప్రసారమవుతున్న ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు ఇస్తే మైనారిటీ వర్గాలను ఎక్కడ దూరం చేసుకోవాల్సి వస్తుందన్న భయం కూడా చంద్రబాబులో ఉన్నట్లుగా తెలుస్తుంది.మరి నిన్న మొన్నటి వరకు ఉన్న ఆసక్తి కూడా ప్రస్తుతం చంద్రబాబులో లేదని ఎన్నికలకు దగ్గరికి వచ్చిన తర్వాత అప్పటి సమీకరణాలను బట్టి ఆకరి క్షణం లో నిర్ణయం తీసుకోవచ్చని తెలుగుదేశం అదినేత భావిస్తున్నట్లుగా తెలుస్తుంది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube