ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ తన వ్యాపారాలను మరింత విస్తరించేందుకు పూనుకుంది.ప్రస్తుతం తోపుడుబండ్ల నుంచి కార్లు కొనే వరకు అన్ని ఆన్ లైన్ లోనే జరిగిపోతున్నాయి.
ఈ క్రమంలో బడా వ్యాపారవేత్తలు సామాన్య ప్రజలకు సైతం చేరువయ్యేలా డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్నారు.అయితే ఇప్పుడు టాటా గ్రూపు వంతు వచ్చింది.
కిరాణా సరుకుల నుంచి విమాన టికెట్లు బుక్ చేసేంత వరకు అన్ని సేవలను ఒకే యాప్ ద్వారా అందించేందుకు టాటా గ్రూప్ సిద్ధమైంది.సూపర్ యాప్ టాటాన్యూ పేరుతో ఒక అప్లికేషన్‌ను టాటా సన్స్ తీసుకురానుంది.
ప్రస్తుతం ఈ అప్లికేషన్ ప్రయోగదశలో ఉంది.టాటా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ అప్లికేషన్ సేవలను వినియోగిస్తున్నారు.
ఇది అందరి ప్రజలకు అందుబాటులోకి రావాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే.అయితే ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో అధికారికంగా ప్రారంభం కానుందని సమాచారం.
టాటా గ్రూప్ ఈ అప్లికేషన్‌ను ప్రారంభించడం నుంచి నిర్వహించడం వరకు2 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది.అనంతరం 5 బిలియన్ డాలర్లను బయట వ్యక్తుల నుంచి సమీకరించనుంది అప్లికేషన్‌ను టాటా గ్రూప్ కు సంబంధించిన అన్ని రకాల వ్యాపారాలకు సింగిల్ పాయింట్ డిజిటల్ డోర్ వేగా రూపొందిస్తున్నారు.
హెల్త్ కేర్, ఫుడ్ అండ్ గ్రాసరీ, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, ఓటీటీ సర్వీసెస్బిల్ చెల్లింపులు.ఇలా వివిధ కేటగిరీలపై టాటా న్యూ అప్లికేషన్ ఆఫర్స్ అందించనుంది.

ఇప్పటికే టాటా న్యూ సూపర్ యాప్ ఫస్ట్ లుక్వైరల్ అవుతోంది.ఇందులో హోం పేజీలో స్కాన్ అండ్ పే, సెండ్ మనీ, పే బిల్స్, ఫైనాన్స్ షాప్ & ఎక్సప్లోర్ వంటి అనేక సేవలు కనిపించాయి.ఇంకా గ్రాసరీ, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్స్, హోటల్స్, ఫ్యాషన్, బ్యూటీ, ఫిట్నెస్, లగ్జరీ, ఫైట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్లపై ఆఫర్స్ అందించనుందని స్పష్టమవుతోంది.ఇందులో వాలెట్ సెక్షన్ కూడా ఇచ్చారు.
అందులో యూజర్లు తమ కార్డుని జోడించి బిల్స్ పే చేసుకోవచ్చు.