పాన్ ఇండియా సినిమాలకు వందల కోట్లు అవసరం లేదు.. తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.అత్యంత భారీ బడ్జెట్ తో వివిధ భాషలలో సినిమాలను తెరకెక్కించి పాన్ ఇండియా చిత్రాలుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

 Tammareddy Bhradwaj Shocking Comments On Pan India Movies Details, Tammareddy,-TeluguStop.com

పాన్ ఇండియా చిత్రాలకు వందల కోట్ల బడ్జెట్ ఖర్చు అవుతుంది అంటూ పెద్ద ఎత్తున సినిమా టికెట్ల రేట్లను పెంచాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.ఈ విధంగా ఇండస్ట్రీలో చాలామంది పాన్ ఇండియా సినిమాలు గురించి కొందరు గొప్పగా మాట్లాడగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం పాన్ ఇండియా చిత్రాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా మేజర్ సినిమా చూసిన తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ మేజర్ సినిమా పై ప్రశంసలు కురిపించడమే కాకుండా పాన్ ఇండియా సినిమాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ మేజర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

మేజర్ సినిమాలో ప్రతి ఒక్కరు ఎంతో అద్భుతంగా నటించారు.నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి చిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి నా అభినందనలు అంటూ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఇక మనమందరం ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం నిజం చెప్పాలంటే మేజర్ సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని తెలిపారు.

Telugu Budget, Adivi Sesh, Pan India, Tamma Bharadwaj, Tamma, Tamma Bhradwaj, Te

ఇటీవల పాన్ ఇండియా సినిమాలకు వంద కోట్ల బడ్జెట్ అవుతుందని చెబుతున్నారు.అయితే మేజర్ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాలకు ఏ మాత్రం తీసిపోదు.టెక్నికల్, క్వాలిటీ పరంగా ఎంతో అద్భుతంగా ఉంది.

ఈ సినిమాకు 25 కోట్ల వరకు ఖర్చు అయింది.ఇలా మిగతా సినిమాలకు ఎందుకు 100 కోట్లు ఖర్చు అవుతుంది.

మేజర్ సినిమాకి కానీ ఖర్చు మీకు ఎందుకు అవుతుంది.షూటింగ్ అని చెప్పి కారవాన్ లో కూర్చుంటున్నారా?సినిమాని ప్యాషన్ తో చేయాలి, సమయం వృధా కాకుండా ఉన్నప్పుడే తక్కువ బడ్జెట్లో సినిమా పూర్తవుతుందని ఈయన పాన్ ఇండియా సినిమాల గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube