నా గురించి అలాంటి పుకారును ప్రచారం చేశారన్న సోనాలి.. పిల్లలున్నారంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనతో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న హీరోయిన్లలో సోనాలి బింద్రే ఒకరు.తక్కువమంది స్టార్ హీరోలకు జోడీగా నటించినా ఈ హీరోయిన్ కు ఊహించని స్థాయిలో ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంది.

 Sonali Bendre Shocking Comments About Viral Gossips In Social Media Details, Son-TeluguStop.com

అయితే సోనాలి బింద్రే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నైతిక విలువలు లేని జర్నలిజం ఎప్పటినుంచో ఉందని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ప్రతి ఒక్కరూ జర్నలిస్టేనని ఆమె కామెంట్లు చేశారు.

ప్రతి ఒక్కరి దగ్గరా కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్ ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.సోషల్ మీడియాలో కూడా మన మనస్సులో ఉన్న అభిప్రాయాలను బలంగా చెప్పే వీలు ఉందని ఆమె కామెంట్లు చేశారు.

అయితే ప్రజల దృష్టిలో ఉన్నవాళ్ల గురించి త్వరగా ఏదో ఒకటి అనుకుంటారని సోనాలి చెప్పుకొచ్చారు.చాలామంది సెలబ్రిటీలకు సంబంధించిన నెగిటివ్ వార్తలను చదవడానికి ఇష్టపడతారని ఆమె అన్నారు.

కొందరు చెడును చూడటానికి సిద్ధంగా ఉంటారని సోనాలి చెప్పుకొచ్చారు.

Telugu Actresssonali, Pan India, Sonali Bendre, Sonalibendre, Gossips-Movie

గతంలో 4 మార్గాల ద్వారా చెడు వార్తలు ప్రచారంలోకి వచ్చేవని ప్రస్తుతం 44 మార్గాల్లో చెడు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయని ఆమె అన్నారు.చెడు వార్తకు, గాసిప్ కు మధ్య గీత చెరిగిపోయిందని నాకు పెళ్లై పిల్లలున్నా ప్రపంచానికి చెప్పలేదని ఒక గాసిప్ ను జోరుగా ప్రచారం చేశారని ఆమె కామెంట్లు చేశారు.

Telugu Actresssonali, Pan India, Sonali Bendre, Sonalibendre, Gossips-Movie

ఆ గాసిప్ ను చాలామంది నమ్మారని ఆమె తెలిపారు.తాను హిందీలో సక్సెస్ అయ్యానని తెలుగు, తమిళం, మరాఠీ భాషల్లో గుర్తింపును సంపాదించానని తాను కూడా పాన్ ఇండియా స్టార్ అని సోనాలి బింద్రే చెప్పుకొచ్చారు.సినిమా రంగం ప్రస్తుతం అందరికీ సులువైన రంగంగా మారిందని సోనాలి బింద్రే కామెంట్లు చేశారు.

సోనాలి బింద్రే గాసిప్స్ గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.నెటిజన్ల నుంచి సోనాలి కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube