ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా చేసినా కూడా నయనతార మాత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనదు.ఆమె ఎందుకు ప్రమోషన్స్‌లో పాల్గొనదో ఆమెకే తెలియాలి.
సైరా నరసింహారెడ్డి వంటి భారీ చిత్రం ప్రమోషన్స్‌లో ఖచ్చితంగా హీరోయిన్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.కాని నయనతార మాత్రం ఎప్పటిలాగే నా వల్ల కాదు అనేసింది.
ఎక్కువ పారితోషికం ఆశ చూపించినా కూడా ఆమె నో అనేసిందట.ఆ కారణంగానే నయనతారపై చిత్ర యూనిట్ సభ్యులు ఆగ్రహంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
నయనతార ప్రమోషన్స్‌కు రాకపోవడంతో ఆమె స్థానంను తమన్నా భర్తీ చేస్తోంది.తమన్నా పాత్ర సినిమాలో కొద్దిగానే ఉన్నా ఆమెకు ప్రమోషన్‌లో మాత్రం కీలక పాత్ర ఇస్తున్నారు.ట్రైలర్స్ మరియు టీజర్‌లో కూడా ఆమెకు స్థానం కల్పించిన విషయంతెల్సిందే.తమన్నా అయినా వచ్చిందంటూ చిత్ర యూనిట్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తమన్నా ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుకతో పాటు చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కూడా పాల్గొంది.నయన్ లేకున్నా కూడా తమన్నా పూర్తిగా తానే హీరోయిన్ అన్నట్లుగా ప్రమోషన్స్‌లో పాల్గొని సైరా కోసం తనవంతు సాయం చేసింది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం రేపు ప్రీమియర్‌లు పడబోతున్నాయి.గాంధీ జయంతి సందర్బంగా భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన సైరా విడుదల కాబోతుంది.నయనతార మరియు తమన్నాలు హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రను అమితాబచ్చన్ పోషించగా విజయ్ సేతుపతి, జగపతిబాబు, కిచ్చ సందీప్ ఇంకా ప్రముఖులు నటించారు.ఈ చిత్రం తెలుగుతో పాటు సౌత్ అన్ని భాషల్లో హిందీలో కూడా విడుదల కాబోతుంది.