పోయిన వస్తువు ఏదైనా మళ్లీ దొరుకుతుందన్న నమ్మకం లేదు.చిన్నదైనా పెద్దదైనా ఒక వస్తువు పోయింది అంటే దానిపై ఆశ వదిలేయాల్సిందే.అలా ఒక మహిళ తన ఐఫోన్ పై ఆశ వదిలేసుకుంది.15 నెలల క్రితం అమెరికాకు చెందిన ఎరికా బెన్నెట్ అనే మహిళ తన ఐ ఫోన్‌ను పోగొట్టుకుంది.ఆమె తన ఫోన్ దొరుకుతుందన్న ఆశను వదిలేసుకుంది.ఎందుకంటే ఆమె ఫోన్ ఒక నదిలో పడిపోయింది.నదిలో పడ్డ ఫోన్ దొరుకుతుందన్న ఆశ ఆమెకు లేదు.
గత ఏడాది ఒక రోజు ఎరికా నదిపై బోటింగ్ చేస్తుంది.
ఆ సమయంలో ఆమె ఐఫోన్ నీటిలో జారి పోయింది.వెంటనే అందుకునేందుకు ప్రయత్నించినా కూడా అది అప్పటికే లోనికి వెళ్లి పోయింది.
దాంతో ఆమె బాధతో అక్కడ నుండి వెళ్లింది.నీటిలో పడ్డ కారణంగా ఇక తన ఫోన్ మళ్లీ దొరుకుతుందన్న ఆశ ఆమెకు లేదు.
కాని అనూహ్యంగా 15 నెలల తర్వాత ఆమెకు ఫోన్ దొరికింది.ఆ ఫోన్‌లో ఉన్న డాటా కోసం చాలా ప్రయత్నించిన ఆమెకు డేటాతో పాటు పూర్తి భద్రంగా ఫోన్ దొరికింది.
ఆ ఫోన్‌లో ఎన్నో ఫొటోలు మరియు ఆమె తండ్రితో జరిపిన చివరి సంభాషణలకు సంబంధించిన మెసేజ్‌లు ఉన్నాయి.వాటి కోసం అయినా ఫోన్ దొరకాలని ఆశ పడింది.
ఆమె ఆశ 15 నెలల తర్వాత తీరింది.నదిలో నిధి కోసం అన్వేషించే ఒక యూట్యూబర్ నదిలో సెర్చ్ చేస్తుండగా ఐఫోన్ దొరికింది.
దానికి ఒక వాటర్ ఫ్రూప్ కవర్ ఉంది.దాంతో అతడు ఆ ఫోన్‌ను బయటకు తీసుకు వచ్చి చార్జ్ చేసి చూశాడు.
చార్జ్ పెట్టిన కొద్ది సమయంకు ఆన్ అయ్యింది.ఫోన్‌ను ఓపెన్ చేసి అందులో ఉన్న నెంబర్ ఆధారంగా ఎరికాకు కాల్ చేశాడు.

అతడి కాల్ అందుకున్న ఎరికా షాక్ అయ్యింది.తన ఫోన్ పని చేస్తుందని తెలిసి కన్నీరు పెట్టుకుంది.వెంటనే వారు చెప్పిన చోటుకు వెళ్లి ఫోన్‌ను తీసుకుంది.ఆ సమయంలో ఆమె కళ్లలో ఆనందం చూసి సదరు యూట్యూబర్ ఆశ్చర్యపోయాడు.ఈ పక్రియ మొత్తం అతడు వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా అది లక్షల్లో వ్యూస్‌ను దక్కించుకుంటుంది.