పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై టీ.కాంగ్రెస్ తర్జనభర్జన

పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ తర్జనభర్జన కొనసాగుతోంది.ఇప్పటికే 14 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే మరో మూడు స్థానాలను పెండింగ్ లో పెట్టింది.ఖమ్మం, హైదరాబాద్ మరియు కరీంనగర్ పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధిష్టానం నిర్ణయానికి రాలేకపోతుందని తెలుస్తోంది.

ఇందులో ఖమ్మం పార్లమెంట్ స్థానం హస్తం పార్టీలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు.ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టికెట్ కోసం పోటీ పడుతున్నారు.

ఈ క్రమంలోనే ఖమ్మం సీటుపై భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి , తుమ్మల నాగేశ్వర రావు( Bhatti Vikramarka, Ponguleti Srinivasa Reddy, Tummala Nageswara Rao ) పట్టువదలడం లేదు.అదేవిధంగా సీనియర్ నేత వి హనుమంతరావు( V Hanumantha Rao ) కూడా ఖమ్మం టికెట్ ను ఆశిస్తున్న వారిలో ఉన్నారు.

Advertisement

హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తుంది.సీటును మైనారిటీ నేతను బరిలో దించాలని భావిస్తున్న కాంగ్రెస్ ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక కరీంనగర్ టికెట్ పై కూడా తర్జన భర్జన కొనసాగుతోంది.కాగా ఈ మూడు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు