Surekha Vani : ఇష్టానికి అవసరానికి వాడుకొని ఇప్పుడు ఇలా చేశారు… సురేఖ వాణి కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సురేఖ వాణి ( Surekha Vani ) ఒకరు.ఎన్నో తెలుగు సినిమాలలో అక్క పిన్ని వదిన పాత్రలలో ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారని చెప్పాలి.

 Surekha Vani Viral Comments On Industry Full Details Inside-TeluguStop.com

కరోనా సమయంలో పూర్తిగా ఇంటికే పరిమితమైనటువంటి ఈమె సోషల్ మీడియాలోకి అడుగు పెట్టారు ఇలా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టినటువంటి సురేఖ వాణి పెద్ద ఎత్తున తన కుమార్తెతో కలిసి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి హంగామా మామూలుగా లేదు.

ఈ విధంగా సోషల్ మీడియా( Social media ) వేదికగా తన కుమార్తెతో కలిసి తరుచూ చేసే రీల్స్ వీడియోస్ అలాగే వీరిద్దరూ వెకేషన్ లకు వెళ్లడం పార్టీలు చేసుకోవడం వంటి వాటికి సంబంధించి అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు .ఇలా సోషల్ మీడియాలో ఈ తల్లి కూతుర్లకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండటం వల్ల సురేఖ వాణి సినిమాలపై కూడా కాస్త ఆసక్తి తగ్గించారనే చెప్పాలి.

ఇకపోతే ఈ మధ్యకాలంలో సురేఖ వాణి డబ్ స్మాష్ వీడియోలు భారీగా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ముఖ్యంగా ఈమె వైయస్ షర్మిల వీడియోలను చేస్తూ పెద్ద ఎత్తున ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.ఇక తాజాగా అలాంటి వీడియోని ఈమె ఒకటి షేర్ చేసారు ఇందులో భాగంగా నాకెవరూ లేరు ఉండాలని కూడా నేను అనుకోలేదు.మీలాగా లేని ప్రేమలు ఉన్నాయని నటించే లైఫ్ నేను బ్రతకలేను.

ప్లాస్టిక్ లైఫ్ ఇష్టానికి అవసరానికి రిలేషన్ షిప్స్ వాడుకొని ఇలా సమయం వచ్చినప్పుడు పక్కవాడి బ్రతుకుపై నెట్టేసే అంత స్టుపిడ్ కాదు నేను అంటూ ఉన్నటువంటి ఒక వీడియోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.దీంతో నిజంగానే వ్యక్తిగత జీవితంలో కూడా ఎవరైనా నిన్ను ఇలా వాడుకొని వదిలేసారా అందుకే అంత ఫీల్ అయి డైలాగ్ చెప్పారా అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక ఈమె భర్త సురేష్ తేజ ( Suresh teja )2019వ సంవత్సరంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా అనారోగ్య సమస్యలతో ఈమె భర్త మరణించడంతో అప్పటినుంచి తన కుమార్తెతో కలిసి ఒంటరిగా జీవితంలో ముందుకు వెళ్తున్నారు.ఇక సురేఖ వాణి భర్త చనిపోయిన తర్వాత ఈమె కూడా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇలా సురేఖ వాణి పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు రావడమే కాకుండా తన కుమార్తె సుప్రీత పెళ్లి చేసేస్తే బాగుంటుంది అంటూ కూడా పలు సందర్భాలలో కామెంట్ చేయడంతో ఈమె నిజంగానే రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ సురేఖవాణి మాత్రం ఆ వార్తలను కొట్టి పారేశారు.

ఇప్పటివరకు అయితే ఈమె రెండో పెళ్లి గురించి ఆలోచించకుండా పూర్తిగా తన కుమార్తె సుప్రీత గురించి ఆలోచిస్తూ రెండో పెళ్లి విరమించుకున్నారు.భవిష్యత్తులో ఈమె రెండో పెళ్లి చేసుకున్న కూడా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని పలువురు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube