జగన్ సర్కార్ పై సెటైర్లు వేసిన సురేఖావాణి కూతురు.. పవన్ కళ్యాణ్ గురించి అలా చెబుతూ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్( jagan ) సర్కార్ ఏపీ అభివృద్ధి కోసం మూడు రాజధానుల అమలు దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.ఏపీ సర్కార్ రాజధానుల విషయంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 Surekha Vani Daughter Satires About Jagan Sarkar Details Here Goes Viral , Surek-TeluguStop.com

కోర్టు కేసుల వల్ల రాజధాని అభివృద్ధి దిశగా ముందడుగులు వేయడంలో జగన్ సర్కార్ ఫెయిలవుతుండటం గమనార్హం.

జగన్ సర్కార్ దృష్టిలో వైజాగ్ ఏపీ రాజధాని కాగా అమరావతి, కర్నూలు అభివృద్ధి దిశగా కూడా అడుగులు వేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది.

మూడు రాజధానులను వేగంగా అమలు చేసేలా కోర్టుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేలా జగన్ సర్కార్ అడుగులు వేస్తున్నా సుప్రీం కోర్టులో పిటిషన్ల విచారణ ఆలస్యమవుతుండటం గమనార్హం.త్వరలో వైజాగ్ కేంద్రంగా జగన్ సర్కార్ పాలన సాగించనుందని వార్తలు వస్తున్నాయి.

అయితే తాజాగా సురేఖావాణి కూతురు ( Daughter of Surekhavani )నెటిజన్లతో ముచ్చటించారు.నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలను ఇచ్చారు.ఏపీ రాజధాని ఏది అని ఒక నెటిజన్ ప్రశ్నించగా అదో పెద్ద మిస్టరీ అని ఆమె సమాధానం ఇచ్చారు.సుప్రీత కామెంట్లు జగన్ సర్కార్ పై సెటైర్లు వేసినట్టుగా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరో నెటిజన్ సుప్రీతను పవన్( Pawan ) గురించి అడిగారు.

పవన్ హీరోగా ఇష్టమా? పవన్ సిద్దాంతాలు ఇష్టమా? జనసేనకు మద్దతు ఉందా? అనే ప్రశ్నకు నాకు పవన్ హీరోగా ఎంత ఇష్టమో ఆయన సిద్దాంతాలు కూడా అంతే ఇష్టమని సుప్రీత తెలిపారు.సుప్రీత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.సుప్రీత సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

సుప్రీత నటిగా సక్సెస్ కావాలని ఆమె శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

Surekhavani Daughter Satires on YS Jagan

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube