విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ.. సూర్యకాంతితో నడిచే బైక్‌కు రూపకల్పన!

ప్రస్తుతం కాలంలో పెట్రోల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి.దీంతో బైక్ బయటకు తీయాలంటేనే జనాలు భయపడుతున్నారు.

 Students' Amazing Invention Design For A Sun-powered Bike , Bike, Solar Bike, Te-TeluguStop.com

పోనీ ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ బైక్ కొనాలని కొందరికి ఉంటుంది.అయితే వాటి ధరలు చూసి అవాక్కవుతున్నారు.

ఒకవేళ ఎంతో వెచ్చించి వాటిని కొన్నా, ఇటీవల కాలంలో బ్యాటరీలు పేలిపోతున్నాయి.ఆయా ఘటనల్లో కొందరు చనిపోతున్నారు కూడా.

దీంతో సొంతవాహనంపై బయటకు వెళ్లాలనుకునే వారు ఇరకాటంలో పడుతున్నారు.అటువంటి వారికి ‘ఐఐటీ సాకేత్‘ విద్యార్థులు గుడ్ న్యూస్ అందించారు.

పెట్రోల్ పోయించుకోకుండా, ఛార్జింగ్ పెట్టకుండా రోడ్లపై పరుగులు తీసే చక్కటి బైక్‌కు రూపకల్పన రూపొందించారు.

ఐఐటీ సాకేత్ విద్యార్థులు ఓ అద్భుత ఆవిష్కరణకు నాంది పలికారు.

కేవలం సౌర విద్యుత్‌తో నడిచే ఓ సూపర్ బైక్‌ను తయారు చేశారు.ఓ పాతదైన, పాడైపోయిన బైక్‌‌ను తీసుకున్నారు.

దానికి సోలార్ ప్యానెల్‌ను బిగించారు.బ్యాటరీని కూడా దానికి అమర్చారు.

దీంతో ఎలాంటి ఛార్జింగ్ పెట్టకుండానే ఈ బైక్‌పై మనం ప్రయాణించొచ్చు.కేవలం సూర్యకాంతితోనే ఈ బైక్ నడుస్తుంది.

దీంతో ఒక్కసారి ఇలాంటి బైక్ కొంటే రూపాయి ఖర్చు పెట్టకుండానే ప్రయాణం చేయొచ్చు.ప్రయాణానికి కొన్ని గంటల ముందు ఎండలో ఉంచితే మరింత బాగుంటుంది.

ప్రయాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది.

దీనిని ఐఐటీ సాకేత్ విద్యార్థులు ఓ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు.

దీంతో దీని గురించి అందరికీ తెలిసింది.ఇలాంటి బైక్ ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఐటీఐ సాకేత్ కోఆర్డినేటర్ బనీ సింగ్ చౌహాన్ దీనిపై స్పందించారు.తమ విద్యార్థులు కేవలం 15 రోజుల్లోనే ఈ బైక్‌ను తయారు చేసినట్లు వెల్లడించారు.

సామాన్యులకు ఉపయోగపడేలా ఇటువంటి బైక్‌లను రూపొందిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు.త్వరలోనే దీనికి పేటెంట్ వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

కేవలం ఎండలో 4 గంటలు ఉంచి, ఆ తర్వాత దీనిపై ప్రయాణించొచ్చన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube