సాధారణంగా మనలో చాలా మందికి పజిల్ గేమ్స్ అంటే చాలా ఇష్టం.అందులో బ్రెయిన్ గేమ్స్ కూడా ఉంటాయి.
కానీ, స్ట్రెస్‌ను తగ్గించే యాప్‌లు కూడా ఉన్నాయి.అయితే, వాటి పనితీరు ఎలా ఉందో తెలుసుకుందాం.అవును! వీటిలోని కొన్ని స్ట్రెస్ రిలీఫ్ గేమ్స్‌తో కాస్త ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం ఉంటుందట.ఇప్పటికే ఈ మైండ్‌ఫుల్‌నెస్ యాప్స్‌పై పరిశోధనలు చేశారు.2019లో దీనిపై అధ్యయనం చేసి, జేఎంఐఆర్ ఎంహెల్త్, యూఎల్త్ అనే పేరుతో ప్రచూరించారు.కరోనా నేపథ్యలో చాలా మంది ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా కూడా ఒత్తిడికి గురయ్యారు.
కామ్ ఆన్ స్ట్రెస్డ్‌అనే యాప్‌ను కూడా పరిశీలించారు.ఈ యాప్‌తో మెదడు పనితీరు మెరుగుపడిందట.
సమయంలో కొద్దిసేపు ఈ యాప్‌లను కాసేపు చూస్తే స్ట్రెస్ నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు తెలిపారు.మన స్మార్ట్ ఫోన్లలో ఉండే ఈ యాప్స్ నిరంతరం ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు లభించాయని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్‌తో హెడ్ స్పేస్ అనే మరో యాప్‌పై అధ్యయనం కూడా చేశారు.
ఈ అధ్యయనాల సర్వే ప్రకారం 12 శాతం బర్న్ అవుట్ సమస్య తగ్గిందని ఆరోగ్య నిపుణులు కూడా పరిశీలించి చెప్పారు.దీనివల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.
ఈ యాప్స్‌కు వినియోగదారులు కూడా పెరిగారు.హెడ్ స్పేస్‌ను కూడా భారత్‌లో వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది.

మీకు వీలైన సమయంలో లాగిన్ అయి, మీకు ఇష్టమైన సమయాన్ని సెట్ చేసుకోవచ్చు.రోజూవారీ జీవితం మెడిటేషన్‌ను మనం అలవాటు పరుచుకోవాలి.సాయంత్రం, ఉదయం, వీలైన సమయంలో కాసేపు సమయాన్ని కేటాయించి ఓ పది నిమిషాలు మెడిటేషన్ చేయాలి.అయితే ఈ యాప్స్‌తో హై లెవల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్న వారికి అంతగా పనిచేయక పోవచ్చు.వారు సంబంధిత వైద్య నిపుణులను కలవాలి.పైగా నైపుణ్యం కల్గిన టీచర్స్‌తో ధ్యానం నేర్చుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఒకవేళ మీకు సమయం సరిపోకపోతే, స్మార్ట్‌ఫోన్ యాప్‌లలో టైమ్ సెట్ చేసుకుని ఇంట్లోనే స్వయంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.రోజూవారీ లైఫ్‌లో ధ్యాన సాధన, మైండ్ ఫుల్‌నెస్ సాధన చాలా అవసరం.
అప్పుడే మనిషి ఎన్ని అవాంతరాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కోగలడు.