ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప.ఈ సినిమా ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.
ఈ సినిమా డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లను సాధించింది.ఇక ఈ మధ్యనే ఓటిటి లో కూడా విడుదల అయ్యి అక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది.
ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ గా కనిపించి అభిమానులను బాగా ఆకట్టు కున్నాడు.ఈయన నటనకు అందరూ ప్రశంసలు కురిపించారు.
ఈ సినిమాలో అన్ని కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.పుష్ప రాజ్ క్రేజ్ రోజురోజుకూ పెరిగి పోతుంది.
సెలెబ్రిటీలు సైతం పుష్ప మాయలో పడుతున్నారు అంటేనే అర్ధం అవుతుంది ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో.
పుష్ప సినిమా రిలీజ్ అయినప్పటి నుండి మునుపెన్నడూ లేని విషంగా పుష్పరాజ్ ట్రెండ్ సెట్ చేసాడు.ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ అయితే మాములు ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు సైతం పలుకుతున్నారు.తగ్గేదే లే.పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా?.ఫైర్.
ఇక ఈ రెండు డైలాగ్స్ అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా పుష్ప మ్యానియా మాత్రం తగ్గడం లేదు.
ఈ ఫైర్ తాజాగా క్రికెటర్లను కూడా తాకినట్టు కనిపిస్తుంది.క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా పుష్ప రాజ్ లుక్ లోకి మారిపోయాడు.జడేజా పుష్ప రాజ్ గా మారిపోయిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.మిగతా వాళ్లకు ఎలా ఉన్నా జడేజా కు మాత్రం పుష్పరాజ్ లుక్ బాగా సెట్ అయ్యింది అనే చెప్పాలి.
అల్లు అర్జున్ పుష్పరాజ్ గెటప్ లో ఎలా ఉన్నాడో జడేజా కూడా డిట్టో అలానే కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఆశ్చర్య పరుస్తున్నాడు.
వైరల్ అవుతున్న ఈ ఫొటోలో జడేజా బీడీ తాగుతూ ” పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా.
ఫైరూ.అని ట్వీట్ చేసాడు.
ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.అలాగే జడేజా ఒక క్రికెటర్ గా పొగాకు వాడకూడదు అనే విషయాన్నీ కూడా తెలిపాడు.
ఇంతకు ముందు కూడా జడేజా తగ్గేదే లే అంటూ ఒక వీడియోను షేర్ చేసిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు పుష్పలాగా పూర్తిగా మాస్ లుక్ లోకి మారిపోయాడు.
సెలెబ్రిటీలు సైతం పుష్ప లుక్ లో కనిపించి సందడి చేస్తున్నారు అంటే ఈ సినిమా ఉత్తరాది ప్రేక్షకులను అలరించింది అనే చెప్పాలి.