స్టార్ హీరోయిన్ రష్మిక డ్రెస్ ఖరీదెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్న గతేడాది పుష్ప ది రైజ్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు.ఈ ఏడాది ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో రష్మికకు చేదు ఫలితం ఎదురైంది.

 Star Heroine Rashmika Mandanna Dress Price Details, Rashmika Mandanna, Rashmika-TeluguStop.com

అయితే ఆ సినిమా ఫ్లాప్ అయినా రష్మిక క్రేజ్ తో తర్వాత సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయని ఆమె ఫ్యాన్స్ చెబుతున్నారు.రష్మిక సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ హీరోయిన్ అని ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో రష్మిక కెరీర్ మొదలుకాగా తెలుగు సినిమాలతోనే ఆమెకు స్టార్ స్టేటస్ దక్కింది.ఛలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక తొలి సినిమా సక్సెస్ తోనే ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.

గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు సినిమాల విజయాల వల్ల రష్మికకు స్టార్ స్టేటస్ అయితే దక్కింది.ప్రస్తుతం వరుసగా ఆరు సినిమాలతో రష్మిక బిజీగా ఉన్నారు.

అయితే రష్మిక లెహంగా ధరించి ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

Telugu Rupees, Rashmika-Movie

రష్మిక షేర్ చేసిన ఈ ఫోటోకు దాదాపుగా 25 లక్షల లైక్స్ వచ్చాయి.ఈ డ్రెస్ ధర ఏకంగా 1,70,000 రూపాయలు అని తెలుస్తోంది.రష్మిక డ్రెస్ రేటు తెలిసి ఆమె అభిమానులు సైతం షాకవుతున్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా రష్మికకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయనే సంగతి తెలిసిందే.

Telugu Rupees, Rashmika-Movie

ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడం వల్లే రష్మిక ఈ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.రష్మిక ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube