క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో రామ్ చరణ్, శ్రీకాంత్ హీరోలుగా కాజల్, కమిలినీ ముఖర్జీ హీరోయిన్లుగా నటించిన గోవిందుడు అందరివాడేలే బాక్సాఫీస్ దగ్గర అబవ్ యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు.
అయితే కృష్ణవంశీ ఈ సినిమా కథను అక్కినేని నాగార్జున ఫ్యామిలీ కోసం సిద్ధం చేశారని సమాచారం.

అక్కినేని నాగార్జున మూడు తరాల కథతో తెరకెక్కే స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తుండగా కృష్ణవంశీ గోవిందుడు అందరివాడేలే కథను చెప్పారు.అయితే నాగార్జునకు ఫస్ట్ హాఫ్ నచ్చినా సెకండాఫ్ నచ్చకపోవడంతో ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారు.ఆ తరువాత అక్కినేని ఫ్యామిలీ విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన మనం సినిమాలో నటించడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం గురించి తెలిసిందే.

ఈ సినిమాలో శ్రీకాంత్ పాత్రలో వెంకటేష్ నటించాల్సి ఉండగా కొన్ని రీజన్స్ వల్ల వెంకటేష్ కూడా ఈ సినిమాలో నటించే విషయంలో వెనక్కు తగ్గారు.రిలీజ్ రోజున పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి 41.55 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.తొలి వారంలోనే 35 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను ఈ సినిమా సాధించడం గమనార్హం.

రెండో వారం కూడా భారీ కలెక్షన్లను సాధించి ఉంటే మాత్రం గోవిందుడు అందరివాడేలే రామ్ చరణ్ కెరీర్ లో మరపురాని చిత్రంగా మిగిలి ఉండేది.సినిమాలో రామ్ చరణ్ తాత పాత్రకు మొదట ఒక తమిళ నటుడు ఎంపిక కాగా తరువాత చిరంజీవి సూచనల మేరకు ఆ పాత్రకు ప్రకాష్ రాజ్ ను ఎంపిక చేశారు.