తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్లకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి చాలా సినిమాలను చేస్తూ తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఆయనకి మంచి గుర్తింపు తీసుకురావడమే కాకుండా ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవరు చేయలేని ఒక కొత్త జానర్ లో సినిమాలు చేయడానికి ప్రతి డైరెక్టర్ కూడా ఆసక్తి చూపిస్తు ఉంటారు.
ఇక తెలుగులో మంచి సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) ప్రస్తుతం ధనుష్ తో ఒక సినిమా చేస్తున్నాడు.
అయితే శేఖర్ కమ్ముల సినిమాలు డిఫరెంట్ వేలో ఉంటాయి.ఆయన రోటీన్ సినిమాలకు భిన్నంగా సినిమాలను చేస్తూ ఉంటాడు.అందువల్లే ఆయన సినిమాకి ప్రత్యేకమైన గుర్తింపు అయితే వస్తుంది.
ఇక దీని వల్ల ఆయనకి మిగతా డైరెక్టర్ల కి మధ్య తేడాలు అయితే ఉంటాయి.ఇక ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల ఫిదా సినిమా తర్వాత మోహన్ లాల్ తో( Mohanlal ) ఒక సినిమా చేయాల్సింది.
అయితే అదొక డిఫరెంట్ జానర్ లో నడిచే కథ దానికి మోహన్ లాల్ తప్ప మరొక హీరో అయితే సెట్ అవ్వడనే ఉద్దేశ్యం తో ఆయన్ని కలిసి ఒక కథ కూడా చెప్పాడట.ఇక దానికి మోహన్ లాల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
కానీ తీరా సమయానికి శేఖర్ కమ్ముల ఆ సినిమాను పక్కనపెట్టి నాగచైతన్యతో లవ్ స్టోరీ అనే సినిమా చేయాలనే ఆలోచనను విరమించుకున్నట్టుగా తెలుస్తుంది.
అలా మోహన్ లాల్ తో ఒక డిఫరెంట్ జానర్ లో సినిమా చేయాలనుకున్న శేఖర్ కమ్ముల దాన్ని ఆపేయడానికి గల కారణం ఏంటి అంటే ఆ సినిమాకు ముందు అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ అవుతుందట.ఇక ఆ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించే వ్యక్తి ఆ సినిమాని తాత్కాలికంగా నిలిపివేయమని చెప్పడంతో శేఖర్ కమ్ముల మోహన్ లాల్ కి చెప్పి ఆ ప్రాజెక్టు ను నిలిపివేశాడట.దాంతో మోహన్ లాల్ కూడా ఓకే అని చెప్పి తన కమిట్ అయిన మిగితా సినిమా పనుల్లో బిజీ అయిపోయాడట…