ఆ విషయం లో పుష్ప ది రూల్ కంటే రాధేశ్యామ్ మూవీనే తోపు.. అసలేం జరిగిందంటే?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందనలు హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2021 లో విడుదల అయిన పుష్ప 1 కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

 Pushpa Teaser Also Supposed To Break Records, Pushpa, Pushpa 2 Teaser, Break R-TeluguStop.com

ప్రస్తుతం మూవీ షూటింగ్ దశలో ఉంది.కాగా ఇటీవల అల్లు అర్జున్( అల్లు అర్జున్ ) బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న పుష్ప టీజర్ ని చేశారు మూవీ మేకర్స్.

ఐదు రోజుల ముందు నుంచి టీజర్ పై రెగ్యులర్ అప్డేట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు.దేశ వ్యాప్తంగా పుష్ప ది రూల్ సినిమాపై భారీ హైప్ నెలకొంది.

Telugu Salaar, Break, Pushpa, Pushpa Teaser, Radhe Shayam, Radheshyam, Tollywood

ముఖ్యంగా తెలుగు, హిందీ భాషలలో పుష్ప 2( Pushpa 2 ) మూవీ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలో సుకుమార్ పుష్ప ది రూల్ టీజర్ ఎలా ఉండబోతోందా అనే ఆసక్తి ముందే అందరిలో అంచనాలను పెంచింది.దానికి తగ్గట్లుగానే గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్ ని టీజర్ గా రిలీజ్ చేశారు.ఈ టీజర్ కి అనూహ్య స్పందన వచ్చింది.

జాతరలో చీరకట్టులో బన్నీ యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉందనే మాట ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది.కచ్చితంగా ఈ టీజర్ రికార్డులని తిరగరాస్తుందని అందరూ భావించారు.అయితే 24 గంటల్లో పుష్ప ది రూల్ టీజర్ ( Pushpa 2 The Rule Teaser )కేవలం 39.6 మిలియన్ వ్యూవ్స్ సొంతం చేసుకుంది.

Telugu Salaar, Break, Pushpa, Pushpa Teaser, Radhe Shayam, Radheshyam, Tollywood

24 గంటల్లో అత్యధిక వ్యూవ్స్ సాధించిన మూవీ టీజర్స్ జాబితాలో ఈ మూవీ ఐదో స్థానంలో ఉంది.మొదటి స్థానంలో ప్రభాస్ సలార్ ( Salaar )ఉంది.ఈ మూవీ టీజర్ ని 24 గంటల్లో ఏకంగా 83 మిలియన్స్ మంది వీక్షించారు.రెండో స్థానంలో ప్రభాస్ ఆదిపురుష్ నిలిచింది.దీనిని 68.96 మిలియన్స్ మంది ఆడియన్స్ వీక్షించడం విశేషం.మూడో స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ ఉంది.ఈ టీజర్ 24 గంటల వ్యవధిలో 68.83 మిలియన్స్ వ్యూవ్స్ సొంతం చేసుకుంది.ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ టీజర్( Radhe Shyam Trailer ) కు 24 గంటల్లో 42.66 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి.ఇక దీని తర్వాత స్థానంలో పుష్ప ది రూల్ మూవీ ఉంది.

హైయెస్ట్ వ్యూవ్స్ సొంతం చేసుకున్న టాప్ 5 సినిమాలలో మూడు ప్రభాస్ వే కావడం విశేషం.అయితే బన్నీ పుష్ప టీజర్ కూడా టాప్ రికార్డులను బ్రేక్ చేస్తుందని అనుకుంటే రాధేశ్యామ్ రికార్డును కూడా అందుకోలేకపోయింది.

సినిమాతో బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల టార్గెట్ ను టచ్ చేయాలని అనుకుంటున్న మేకర్స్ కు కొంత వరకు ఇది షాక్ ఇచ్చింది.టీజర్ కు సరైన రెస్పాన్స్ వచ్చింది కానీ టాప్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయాలంటే ఈ సౌండ్ సరిపోదు అనేలా కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube