మహిళల టీ20 వరల్డ్ కప్ లో రికార్డు సృష్టించిన స్పిన్నర్ దీప్తి శర్మ..!

మహిళల టీ 20 వరల్డ్ కప్ లో ఇండియన్ టీం అద్భుతమైన విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది.మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై విజయం సాధించి, రెండవ మ్యాచ్ వెస్టిండీస్ పై ఘనమైన విజయం సాధించి రికార్డు సృష్టించింది భారత్ టీం.

 Spinner Deepti Sharma Created A Record In Women's T20 World Cup , Deepti Sharma-TeluguStop.com

ఇదే ఫామ్ లో ఇంగ్లాండ్, ఐర్లాండ్ జరిగే మ్యాచ్ లలో జోరు కొనసాగిస్తే భారత్ సెమీ ఫైనల్ కు చేరినట్లే.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ ఆరు వికెట్లను కోల్పోయి 118 స్కోర్ చేసింది.

ఇక కేవలం నాలుగు పరుగులకే మొదటి వికెట్ ను కోల్పోయింది వెస్టిండీస్.తర్వాత టేలర్, క్యాంప్ బెల్ సమర్థంగా ఆడిన కూడా భాగస్వామ్యంలో 73 పరుగులకు చేరుకోగానే దీప్తి శర్మ, క్యాంప్ బెల్ ను అవుట్ చేసింది.

Telugu Deepti Sharma, India, Latest Telugu, Pooja Vastrakar, Renuka Singh, Cup,

అప్పటివరకు వెస్టిండీస్ పై ఉండే అంచనాలు తారుమారయ్యాయి.అంతవరకు చక్కగా ఆడిన వెస్టిండీస్ కు ఒక్క సారిగా బ్రేక్ పడింది.ఇక మందన త్రో తో వికెట్ కీపర్ రిచా, హెన్రీ ని ఘోష్ ఔట్ చేయడంతో వెస్టిండీస్ పని పూర్తిగా అయిపోయింది.ఇక రేణుక సింగ్, పూజా వస్త్రాకర్ చెరొక వికెట్ తీశారు.

Telugu Deepti Sharma, India, Latest Telugu, Pooja Vastrakar, Renuka Singh, Cup,

దీప్తి శర్మ తన స్పిన్నింగ్ తో (4-0-15-3) వెస్టిండీస్ కు చెమటలు పట్టించింది.ఇక స్టెఫానీ టైలర్ (42), క్యాంప్ బెల్ (30) స్కోరు చేయగా మిగతా వాళ్ళు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు.ఇక భారత టీమ్ లో రిచా ఘోష్ (44 నోటౌట్), హర్మన్ ప్రీత్ కౌర్ (33) స్కోర్లు నమోదు చేయడం తో టీమ్ ఇండియా 18.1 ఓవర్లలోనే 119/4 లక్ష్యాన్ని చేదించింది.ఇక మూడు వికెట్లు తీసిన స్పిన్నర్ దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube