Shakrukh Khan : అప్పుడు షారుఖ్ ను కలవలేక అలా ఫోటో దిగాడు.. ఇప్పుడు షారుఖ్ కు హిట్టిచ్చాడు.. అట్లీ గ్రేట్ అంటూ?

డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ( Shakrukh khan )కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం జవాన్.తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Special Story On Director Atlee Jawan Mersal Theri Bigil Fame-TeluguStop.com

దీంతో ప్రస్తుతం దర్శకుడు అలాగే హీరో షారుక్ ఖాన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.వారిద్దరికీ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్స్ ప్రేక్షకులు సెలబ్రిటీలు.

ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ అట్లీ( Director atlee )కీ సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో మారాయి.ఆ వివరాల్లోకి వెళితే.

Telugu Bollywood, Atlee, Jawan, Pathaan, Shakrukh Khan, Tollywood-Movie

జవాన్ సినిమా( Jawan movie ) కంటే ముందు పలు సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు అట్లీ.నాలుగు సినిమాల అనుభవంతో షారుక్ ఖాన్ తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందించడంతో పాటు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు.వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతోంది అని ప్రకటించినప్పటి నుంచి సినిమా విడుదల అయ్యేవరకు ఆ అంచనాలు మరింత పెరుగుతూ వచ్చాయి.ఆ భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 7న విడుదల అయ్యి ప్రస్తుతం కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డు సృష్టించింది.హిందీ, తమిళం, తెలుగులో విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.

Telugu Bollywood, Atlee, Jawan, Pathaan, Shakrukh Khan, Tollywood-Movie

అంతేకాకుండా షారుఖ్ ఖాన్ గత సినిమా పఠాన్ సినిమా( Pathaan ) రికార్డులను బద్దలు కొడుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అయితే కెరీర్‌ ప్రారంభంలో అట్లీ ఒకేసారి ముంబై వెళ్లి షారుక్‌ను కలవాలనుకున్నారట.ఎంత ప్రయత్నించినా కూడా సాధ్యంకాకపోవడంతో షారుక్‌ ఇంటి ముందు ఫొటో దిగి తిరుగు పయనమయ్యారట.

ఇదే విషయాన్ని జవాన్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో గుర్తుచేసుకుంటూ.అప్పట్లో షారుకఖ్ సర్‌ని కలవలేకపోయా.

కానీ జవాన్‌ సినిమా కథ వినిపించేందుకు కారులో ఆయన ఇంటికి వెళ్లాను.ఆ క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను అని సంతోషంతో చెప్పుకొచ్చారు అట్లీ.

ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నిజంగా దర్శకుడు అట్లీ రియల్లీ గ్రేట్.ఒకప్పుడు ఇంటి ముందు ఫోటో దిగిన వ్యక్తి ఇప్పుడు ఆయన పక్కనే నిల్చోవడంతో పాటు ఆయనకు ఒక బ్లాక్ బస్టర్ సినిమాను అందించడం అన్నది నిజంగా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube