డిసెంబర్ 1న విడుదల కానున్న ‘బంగార్రాజు’ నుండి ‘నా కోసం’ సాంగ్ టీజర్

కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా నుంచి విడుదల చేసిన లడ్డుండా అనే పాట, ఫస్ట్ లుక్ పోస్టర్లకు విశేషమైన స్పందన వచ్చింది.ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు.

 Song Teaser Naakosam From 'bangaraju' Which Will Be Released On December 1,naa-TeluguStop.com

లడ్డుండా పాటతో ఏర్పడిన అంచనాలను ముందుకు తీసుకెళ్లేందుకు రెండో పాటను రెడీ చేశారు.డిసెంబర్ 1న ఉదయం 11:12 గంటలకు రెండో పాట ‘నా కోసం’ టీజర్‌ను విడుదల చేయబోతోన్నారు. నాగ చైతన్య, కృతి శెట్టిలపై రొమాంటిక్ సన్నివేశాలు ఈ పాటలో కనిపించబోతోన్నాయి.

అనూప్ రూబెన్స్ అందమైన బాణీని సమకూర్చారు.

మొదటిసారిగా నాగ చైతన్య, క‌ృతి శెట్టి జోడిగా కనిపించబోతోన్నారు.ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా అనూప్ రూబెన్స్ మంచి పాటలను అందించనున్నారు.

Telugu Bangarraju, Dec, Krithi Shetty, Naakosam, Nagarjun, Ramaya Krishna, Tease

అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం.ఆ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు.తండ్రీ కొడుకుల బంధాన్ని చక్కగా పండించి అందరినీ మెప్పించారు.సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’ చిత్రంలో ఈ ఇద్దరూ మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నారు.

మైసూర్‌లో ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది.

Telugu Bangarraju, Dec, Krithi Shetty, Naakosam, Nagarjun, Ramaya Krishna, Tease

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.

నటీనటులు

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ

సాంకేతిక బృందం

కథ, దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ నిర్మాత : అక్కినేని నాగార్జున బ్యానర్స్ : జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.స్క్రీన్ ప్లే : సత్యానంద్ సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫర్ : యువరాజ్ ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి పీఆర్వో : వంశీ-శేఖర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube