ఈనెల 27వ తారీకు నెల్లూరులో సీఎం జగన్ పర్యటించనున్నారు.నేలటూరులోని ఏపిజేన్ కో ప్రాజెక్టు ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.
అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.ఈ నేపథ్యంలో సీఎం జగన్ నెల్లూరు పర్యటనపై టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
పవర్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన గ్రామాల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు.
ఈ క్రమంలో ఈ నెల 27న మూడో యూనిట్ ప్రారంభించి ఆదానికి అంకితం చేయనున్నారు అని వ్యంగ్యంగా విమర్శించారు.
₹23 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రారంభించిన పవర్ ప్లాంట్ నీ ఆదానికి అంకితం చేస్తున్నారని విమర్శల వర్షం కురిపించారు.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గ్రామాలను అధికారులు నిర్బంధించారని ఆరోపించారు.
ప్రజల్లో తిరిగే దమ్ము…ధైర్యం ముఖ్యమంత్రికి లేదని అన్నారు.అందుకే వేలమంది పోలీసులు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలలో ముఖ్యమంత్రి పర్యటన చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు.