ప్రభాస్ ఆదిపురుష్ సినిమా సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు.ఓం రౌత్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ రామాయణ కథతో వస్తుంది.
సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు.సీతగా కృతి సనన్.
సైఫ్ అలి ఖాన్ రావణాసుర పాత్రలో చేస్తున్నారు.సినిమా నుంచి వచ్చిన టీజర్ మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
సినిమా గ్రాఫిక్స్ కార్టూన్ నెట్ వర్క్ ఛానెల్ లో బొమ్మల్లా ఉన్నాయని అంటూ టాక్ వచ్చింది.ఇక ఇదిలాఉంటే ఆదిపురుష్ సినిమాని సంక్రాంతికి రిలీజ్ వాయిదా వేయాలని సౌత్ డిస్ట్రిబ్యూటర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారట.
అలా ఎందుకు అంటే సంక్రాంతికి చిరు వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సిం హా రెడ్డిలు వస్తున్నాయి.మరోపక్క విజయ్ వారసుడు కూడా రిలీజ్ కు సిద్ధమైంది.
అఖిల్ ఏజెంట్ కూడా పొంగల్ రేసులో వస్తుంది.ఈ సినిమాల మధ్య ఆదిపురుష్ రిలీజ్ పై కన్ఫ్యూజన్ ఏర్పడింది.
అందుకే సౌత్ డిస్ట్రిబ్యూటర్స్ ఆదిపురుష్ ని జనవరి 7కి కానీ, 26కి కానీ వాయిదా వేయాలని అంటున్నారు.అయితే బాలీవుడ్ మేకర్స్ మాత్రం దీనికి ససేమీరా ఒప్పుకోవట్లేదు.
సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాల్సిందే అన్నట్టుగా చెబుతున్నారట.ఆదిపురుష్ రిలీజ్ పై ఫైనల్ క్లారిటీ రావాల్సి ఉంది.







