సోలో బ్రతుకే సో బెటర్ హిట్టా..? ఫ్లాపా..?

సాయిధరమ్ తేజ్, నభానటేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.లాక్ డౌన్ తరువాత థియేటర్లలో విడుదలైన తొలి పెద్ద సినిమా ఇదే కావడంతో ఈ సినిమా ఫలితాన్ని బట్టే తమ సినిమాలను విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

 Solo Bratuke So Better Movie Got Positive Response From Audience, Hit Talk, Nab-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ సిటీల్లో ఈరోజు తెల్లవారుజాము నుంచే ఈ సినిమా షోలు పడ్డాయి.

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ఫస్టాప్ ఆశించిన స్థాయిలో లేకపోయినా సెకండాఫ్ సినిమాను నిలబెట్టిందనే చెప్పాలి.విరాట్ పాత్రకు సాయిధరమ్ తేజ్ అమృత పాత్రకు నభా నటేష్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

తొలి సినిమాతోనే దర్శకుడు సుబ్బు సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు.సాయితేజ్ తండ్రి పాత్రలో సీనియర్ నరేష్, మామయ్య పాత్రలో రావు రమేష్ నటించి మెప్పించారు.

Telugu Nabha Natesh, Saidharam Tej, Solo Bratuke-Movie

రెండు గంటల ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది.సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కరోనా కాలంలో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమాను అందించారని చెబుతున్నారు.ఇంటర్వెల్ లో నభా నటేష్ ఎంట్రీ బాగుంది.థమన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యాయి.

సోలో బ్రతుకే సో బెటర్ అనుకునే కుర్రాడు చివరకు తన అభిప్రాయాన్ని మార్చుకుని ఎలా చేసుకున్నాడనే కథతో ఈ సినిమా తెరకెక్కింది.వెన్నెల కిషోర్, సత్య కామెడీ సీన్స్ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి.2020 సంవత్సరానికి సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఫలితం హ్యాపీ ఎండింగ్ ఇచ్చిందనే చెప్పాలి.వరుస విజయాలతో జోరుమీదున్న సాయిధరమ్ తేజ్ ఖాతాలో ఈ సినిమాతో మరో హిట్టు చేరిందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube