ప్రభుత్వ మనుగడ పై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఇంకా రెండు నెలలుకూడా గడవకముందే ప్రభుత్వ మనుగడ పై నీలి మేఘాలు కమ్ముకున్నాయి.ఈ వాఖ్యలు ప్రతిపక్షాలు చేసివుంటే ఏమోలే అనుకోవచ్చు కానీ ఆ పార్టీ కీలక నేత కర్ణాటకలో కాంగ్రెస్ ( Congress party )ను అధికారం లోకి తీసుకొచ్చి ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్( DK Shivakumar ) ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో, రాష్ట్ర రాజకీయాల్లో ఏవో ఊహించని మార్పులు జరగబోతున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 Sivakumar's Sensational Comments On The Survival Of The Government, Sivakumar,-TeluguStop.com

ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుందని బయట రాష్ట్రాలలో కర్ణాటక ప్రభుత్వాన్నిదింపటానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి అని అదే జరిగితే దేశం లో ప్రజాస్వామ్యం లేనట్టే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Telugu Bjp, Congress, Dk Shivakumar, Karnataka, Madhya Pradesh, Rahul Gandhi-Tel

224 అసెంబ్లీ సీట్లు ఉన్న కర్ణాటకలో 135 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ సింగిల్గానే అధికారంలోకి వచ్చి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.తాము ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రజరంజకమైన పాలన నే అందిస్తుంది .అయితే తాము బలం లేని చోట కూడా వ్యూహాత్మకంగా చక్రం తిప్పి అక్కడ ప్రభుత్వాలను పడగొట్టి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న భాజపా( BJP party ) ఎలాగైనా కర్ణాటక ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా డీకే శివకుమార్ వ్యాఖ్యలు ఉన్నాయి.

Telugu Bjp, Congress, Dk Shivakumar, Karnataka, Madhya Pradesh, Rahul Gandhi-Tel

మరే మరే ఇతర నేత అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండుంటే వాటిని అంతా సీరియస్ గా తీసుకోవలసిన అవసరం లేదు కానీ కర్ణాటకలో అంతా తానే చక్రం తిప్పిన డీకే శివకుమార్ ఇలాంటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇది సీరియస్ విశ్లేషణ గానే చూడాలని రాజకీయ పరిశోధకులు పరిశీలకు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఏ విధమైన సమాచారం లేకుండా ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయరని ఇంతకుముందు కూడా మధ్యప్రదేశ్, గోవాలో కూడా భాజపా ప్రభుత్వాలను ఏర్పాటు చేసే ముందు ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారని అవి నిజమయ్యాయని ,కాబట్టి కర్ణాటక రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చని అంచనాలు వెలబడుతున్నాయి మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube