భారతదేశంలో 10 లక్షల మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ మైలురాయిని దాటి సరికొత్త రికార్డుని సృష్టించిన సిరోనా

రుతుక్రమం, దాని తాలూకు పరిణామాలు, మెన్‌స్ట్రువల్‌ కప్‌పై మహిళల్లో అవగాహన పెంచేందుకు ప్రతీక్షణం ప్రయత్నిస్తూ ఉంది సిరోనా.అందుకే రుతుక్రమ సమయంలో మహిళల ఇబ్బందులను గుర్తించి మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ని రూపొందించింది.ఇలా మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ని రూపొందించి, అత్యధిక అమ్మకాలు సాధించిన భారతీయ కంపెనీ సిరోనా మాత్రమే.21 జూలై 2022 – న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రీమియర్‌ ఫెమిననైన్‌ హైజీన్‌ స్టార్టప్‌ కంపెనీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సిరోనా.సిరోనా తన కంపెనీ నుంచి మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ని రూపొందించింది.ఇప్పుడు ఈ మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ అమ్మకాలు భారతదేశంలో 10 లక్షల మార్క్‌ని దాటాయి.ఈ మైలురాయిని దాటిన తొలి భారతీయ కంపెనీగా రికార్డు సృష్టించింది సిరోనా.

 Sirona Sets New Records, Crosses The Sale Of 10 Lakh Menstrual Cups In India Sir-TeluguStop.com

గత కొన్నేళ్లుగా మన సంప్రదాయంలో రుతుక్రమం అనేది నిషిధ్ధమైన పదం.ఆ పదం కలికేందుకు కూడా ఎవ్వరూ సాహసించేవారు కాదు.ఆ పదాన్ని పీరియడ్‌ అనే పదానికి మార్చడంలో సిరోనా కీలకపాత్ర పోషించింది.

ఇప్పుడు ఎక్కువమంది మహిళలు ఈ మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ని ఉపయోగించడంలో కూడా కీలకంగా వ్యవహరించి, ఎప్పటికప్పుడు మహిళలకు ఈ కప్‌ యొక్క లాభాలను వివరిస్తూ అవగాహన పెంచే ప్రయత్నం చేస్తూనే ఉంది.ఈ ప్రయత్నం ఫలితమే ఇప్పుడు 10 లక్షల అమ్మకాలు జరిగి రికార్డు సృష్టించే స్థాయికి చేరుకుంది.

మహిళలకు అవగాహన కలిగించి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడం, సూచనలు చేయడం, అదే సమయంలో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ విజయం లభించింది.

సిరోనా రూపొందించిన మెన్‌స్ట్రువల్ కప్‌లు 100% మెడికల్-గ్రేడ్ సిలికాన్‌తో తయారు చేయబడినవి.ఇవి FDA ఆమోదం పొందాయి.8 గంటల వరకు లీక్‌ప్రూఫ్‌ని అందిస్తుంది.అలాగే దద్దుర్లు నుండి పూర్తి స్వేచ్ఛను అందిస్తాయి.మెన్‌స్ట్రువల్ కప్ శానిటరీ వ్యర్థాలను కూడా ఉత్పత్తి చేయదు.దీన్ని దాదాపు 10 ఏళ్ల వరకు ఉపయోగించవచ్చు.నెలవారీ పీరియడ్‌లను పర్యావరణ అనుకూలమైన మరియు ఆర్థిక ఎంపికగా మారుస్తుంది.

సిరోనా మెన్‌స్ట్రువల్ కప్ కూడా అమెజాన్ బెస్ట్ సెల్లర్‌గా మారింది.అంతేకాకుండా అమెజాన్ బెస్ట్‌ ఛాయిస్ ఉత్పత్తుల్లో ఇది ఒకటి.

ఈ సందర్భంగా సిరోనా సహవ్యవస్థాపకుడు & సీఈఓ శ్రీ దీప్ బజాజ్ మాట్లాడారు.ఆయన మాట్లాడుతూ… “మా సంస్థ మొదలైనప్పటి నుంచి, మా ఏకైక లక్ష్యం మహిళల జీవితాల్లో చెప్పుకోలేని సమస్యకు పరిశుభ్రమైన పరిష్కారం చూపడమే.

మేము మా కస్టమర్‌లకు సరైన నిర్ణయం తీసుకోవడానికి అధికారం ఇచ్చాం.అంతేకాకుండా నిష్పాక్షిక సమాచారాన్ని కూడా వారికి ఎప్పటికప్పుడు తెలియజేస్తాము.

మేము సాధించిన ఈ మైలురాయికి చాలా గర్వంగా ఉంది.రాబోయే రోజుల్లో, మా ఉత్పత్తులు, సేవలు, కంటెంట్ మరింత ప్రభావాన్ని సృష్టించాలని మరియు ఈ వర్గంలోని మహిళలకు పూర్తి పర్యావరణ వ్యవస్థను అందించాలని మేము ఆశిస్తున్నాము అని అన్నారు.

సిరోనా 10 లక్షల అమ్మకాల రికార్డుని సొంతం చేసుకున్న సందర్భంగా కంపెనీ ఒక వీడియోను విడుదల చేసింది.ఈ వీడియోలో ఉద్యోగులు, వినియోగదారులు మరియు కంపెనీ వ్యవస్థాపకులు అందరూ తమ విజయాన్ని ఆనందంగా పంచుకున్నారు.

#10LakhSironaCupverts క్యాంపెయిన్ గురించి సిరోనా మార్కెటింగ్ మరియు బ్రాండ్ కమ్యూనికేషన్స్ హెడ్ అనికా వధేరా మాట్లాడుతూ, “ బహుశా భారతదేశంలో మెన్‌స్ట్రువల్ కప్పులను ప్రవేశపెట్టిన మొదటి బ్రాండ్ సిరోనా మాత్రమే అనుకుంటున్నా.ఎన్నో ఏళ్లుగా అద్భుతమైన కమ్యూనికేషన్, కంటెంట్‌తో ర్యాష్-ఫ్రీ, లీక్-ఫ్రీ, ట్రాష్-ఫ్రీ మరియు క్యాష్-ఫ్రీ మెన్‌స్ట్రుయేటర్‌లను రూపొందించాము.

తద్వారా లక్షల ప్యాడ్‌లను ల్యాండ్‌ఫిల్‌కి వెళ్లకుండా సేవ్ చేసాము.అంతేకాకుండా సిరోనా హైజీన్ ఫౌండేషన్ భారతదేశంలోని మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ని కొనుగోలు చేయలేని పేదవారికి వాటిని ఉచితంగా అందిస్తోంది.

తద్వారా రుతుక్రమ పరిశుభ్రతను మెరుగుపరచడానికి తనవంతు సాయం చేస్తోంది.ఫౌండేషన్ ద్వారా “lakhonkhwayishen” కార్యక్రమంలో 1 లక్ష మందికి పైగా మహిళలకు రుతుక్రమ ఆరోగ్య పద్ధతుల గురించి ఇప్పటికే అవగాహన కల్పించారు.5000 కంటే ఎక్కువ మెన్‌స్ట్రువల్ కప్పులను విరాళంగా అందించారు.ఈ ప్రయాణాంలో మేము చాలా దూరం విజయవంతంగా వచ్చాము.

కచ్చితంగా ఇది వేడుక చేసుకోవాల్సిన సమయమే అని అన్నారుయుక్తవయస్సు నుంచి మోనోపాజ్‌ వరకు మహిళలకు ఎన్నో రకాల ఉత్పత్తులను అందిస్తోంది సిరోనా.కంపెనీ ఉత్పత్తుల యొక్క ప్రధాన ఉద్దేశం ఒక్కటే… పీరియడ్‌, సన్నిహితంగా ఉండడం, హెయిల్‌ రిమూవల్‌ మరియు టాయిలెట్‌ పరిశుభ్రత.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube