కడుపుతో ఉన్న ఇద్దరు భార్యలపై చేయి చేసుకున్న సింగర్.. ఎవరో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు యంగ్ సింగర్ అర్మాన్ మాలిక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అర్మాన్ మాలిక్ బాలీవుడ్ సింగర్ అయినప్పటికీ సౌత్ భాషల్లో కూడా పాటలు పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Singer Armaan Malik Tweet On Youtuber Goes Viral ,singer Armaan Malik, Singer Ar-TeluguStop.com

తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన పాటలు పాడి సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తెలుగులో అలవైకుంఠపురములో, బుట్టబొమ్మ సాంగ్ పాడాడు.

అంతేకాకుండా వకీల్ సాబ్, టక్ జగదీశ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మేజర్, సమంత శాకుంతలం చిత్రాల్లో కూడా అర్మాన్ మాలిక్ పాటలు పాడి ప్రేక్షకులను అలరించాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా అర్మాన్ మాలిక్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే.అర్మాన్ మాలిక్ గర్భంతో ఉన్న తన భార్యలిద్దరిపై చేయి చేసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అర్మాన్ మాలిక్ కి ఇంతవరకు పెళ్లి కాలేదు.అలాంటిది అతడికి ఇద్దరు భార్యలు ఎలా వచ్చారు? అన్నది సోషల్ మీడియాలో ప్రశ్నార్థకంగా మారింది.అర్మాన్ మాలిక్ పేరుతో ఓ యూట్యూబ కూడా ఉన్నాడు.అతడు హిందీలో బాగా పాపులర్ అయ్యాడు.

ఫ్రాంక్ వీడియోలు చేస్తుంటాడు.అతడి ఇద్దరు భార్యలు గర్భంతో ఉన్నారు.

వారి చెంప చెళ్లుమనిపించినట్లు వీడియో పోస్ట్ చేశాడు.

చివరికి ఫ్రాంక్ అంటూ సర్పైజ్ ఇచ్చాడు.అయితే అతడి అసలు పేరు సందీప్.ఈ న్యూస్ వైరల్ కావడంతో సింగర్ అర్మాన్ మాలిక్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు.ముందు అతడిని అర్మాన్ మాలిక్ అని పిలవడం ఆపండి.నా పేరుతో ప్రతి రోజు ఇలాంటి ఆర్టికల్స్ చూస్తుంటే చిరాకు వస్తోంది అంటూ ట్వీట్ చేశాడు.అర్మాన్ మాలిక్ ట్వీట్ పై యూట్యూబర్ సందీప్ స్పందిస్తూ.ఈ ప్రపంచంలో అర్మాన్ మాలిక్ పేరుతో ఒక్కరే ఉండాలి అని రూల్ ఉందా మీరంటే బాలీవుడ్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఫేమస్ అయ్యారు.

నేను ఇలా వీడియోలు చేస్తూ గుర్తింపు సాధిస్తున్నాను.దీంట్లో మీకు పోయేది ఏముంది అంటూ కామెంట్స్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube