ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో సిమ్ కార్డ్.. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా..!

ఓలా కంపెనీ( Ola Company ) నుంచి S1 సిరీస్ లో S1 ఎయిర్,S1 ప్రో,S1 అనే మూడు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.ప్రతినెల ఓలా తన అమ్మకాలలో దూకుడు ప్రదర్శిస్తూనే ఉంది.

 Sim Card In Ola Electric Scooter Do You Know What Is Special About It , Ola Elec-TeluguStop.com

ఓలా స్కూటర్ ముందు భాగంలో ఏడు అంగుళాల TFT డిస్ ప్లే లో వేగం, పరిధి, బ్యాటరీ అనే అంశాలు అందులో గమనించవచ్చు.అయితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో జియో కంపెనీకి ( Jio company )చెందిన సిమ్ కార్డ్ ఉంటుంది అనే విషయం చాలామందికి తెలియదు.

ఒకవేళ తెలిసినా అది ఎందుకు ఉపయోగపడుతుందో అనే విషయాలు తెలియదు.అవి ఏమిటో పూర్తిగా చూద్దాం.

సాధారణంగా మనకు తెలియని ప్రాంతానికి వెళ్లాలంటే స్మార్ట్ ఫోన్లో గూగుల్ మ్యాప్స్ పై ఆధారపడతాం.ఒకవేళ ఇంటర్నెట్ పనిచేయకపోతే ఇక అంతే సంగతులు.కానీ ఈ స్కూటర్లో ఉండే సిమ్ కార్డ్ కు ఇంటర్నెట్ అవసరం లేదు.ఇందులో ఉండే మ్యాప్ తో ఇంటర్నెట్ లేకుండానే గమ్యస్థానాలకు చేరవచ్చు.

Telugu Jio Company, Latest Telugu, Ola Company, Olaelectric-Technology Telugu

స్కూటర్ లో ఉండే యాప్ కు ఇంటర్నెట్ అవసరం.కానీ ఆ ఇంటర్నెట్ ను, ఓలా స్కూటర్ లోనే సదుపాయాన్ని ఏర్పాటు చేసింది.అది ఎలా అంటే ఓలా తాను తయారు చేసే ప్రతి ఎలక్ట్రిక్ స్కూటర్లో జియో సిమ్ కార్డ్ ఇన్స్టాల్ చేసేందుకు జియో కంపెనీ తో జతకట్టింది.ఈ సిమ్ కార్డ్ ద్వారానే ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడుతుంది.

అయితే ఈ సిమ్ కార్డ్ ఫోన్ కాల్స్ మాట్లాడడానికి, ఇతర ఇంటర్నెట్ వినియోగానికి ఉపయోగించడం కుదరదు.

Telugu Jio Company, Latest Telugu, Ola Company, Olaelectric-Technology Telugu

ఈ సిమ్ కార్డ్ కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్ లో కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది.దీనితో మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళ్లాలి, ఎలా వెళ్లాలి అనేది మ్యాప్ లో నావిగేట్ చేసుకోవచ్చు.ఈ సిమ్ కార్డ్ కోసం ప్రత్యేకంగా ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

జీవిత కాలం పాటు ఈ సిమ్ కార్డ్ సేవలను అందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube