శృతి హాసన్ 13 ఏళ్ల జర్నీ.. ప్రేమ కోసం ఎన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కమలహాసన్ కూతురు ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.

 Shruti Haasan Completes 13 Years In The Film Industry Shruthi Hassan, Tollywood,-TeluguStop.com

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ 13 ఏళ్లు పూర్తి అయింది.మొదటి 2019లో విడుదలైన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ లక్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్.

ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాలో కి పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా కూడా నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది.గబ్బర్ సింగ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఆ తర్వాత దశాబ్ద కాలం పాటు కొనసాగుతూ ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అంతేకాకుండా ఈ ముద్దు గుమ్మ తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో కూడా నటించింది.ఇదిలా ఉంటే తాజాగా శృతిహాసన్ తన ఇంస్టాగ్రామ్ లో ఒక నోట్ ని రాసుకు వచ్చింది.

ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలో ఆమె ప్రయాణం గురించి ఒక వీడియోను కూడా విడుదల చేసింది.సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 13 సంవత్సరాలు అయ్యింది.నేను సినిమా రంగంలో ఇంతకంటే ఎక్కువ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు.నేను ఇది చేయడానికి పుట్టలేదు నేను దీన్ని ప్రేమించడం నేర్చుకున్నాను సినిమా నా ఆనందానికి గొప్ప మూలంగా మారింది అని తన నోట్ లో చెప్పుకొచ్చింది శృతిహాసన్.

అలాగే సినీ రంగం నాకు చాలా కృతజ్ఞతతో కూడిన జీవితాన్ని అందించింది.

13 సంవత్సరాలుగా నేను జయాపజయాలను ఎలా ఎదుర్కోవాలో ఆత్మవిశ్వాసంతో ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్న విషయాన్ని నేర్చుకున్నాను అని తెలిపింది శృతిహాసన్.అన్నింటికంటే ఎక్కువగా అభినందించడం గురించి చాలా నేర్చుకున్నాను.నేను ఇంతకు ముందెన్నడూ తెలియని స్త్రీలకు కథలు చెప్పడం వాటికి ఆత్మలను ఇవ్వడం గౌరవం.

నాకు లభించిన ఇంతటి ప్రేమ,ప్రశంసలకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని అంటూ ఎమోషనల్ నోట్ ని రాసకొచ్చింది శృతిహాసన్.అలాగే శ్రుతిహాసన్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు పూర్తయినా అందులోంచి ఓ నాలుగేళ్లు తీసేయాలట.

ఎందుకంటే అప్పట్లో విదేశీ మైఖేల్ కోర్సలేతో ప్రేమాయణంలో ఉన్నప్పుడు కెరీర్ కంటే తనకు వ్యక్తిగత జీవితం చాలా ఇంపార్టెంట్ అంటూ సినిమాలకు టాటా చెప్పేసింది.అగ్రనాయిక హోదాను కూడా లైట్ తీసుకుంది.

అలా నాలుగేళ్లు సినిమాల్లో నటించనేలేదు.అలా తన 13 ఏళ్ళ సినీ కెరీర్ నాలుగేళ్లు తీసేస్తే తొమ్మిదే ఏళ్ళు మాత్రమే హీరోయిన్ ఒక వెలుగు వెలిగింది శృతిహాసన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube