జనగణమన కోసం పూజాకు కళ్ళు చెదిరే రెమ్యునరేషన్.. 45 రోజులకు ఎన్ని కోట్లంటే?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ‘లైగర్’.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.

 Shocking Remuneration Pooja Hegde Jgm, Pooja Hedge, Janaganamana, Vijay Devarako-TeluguStop.com

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.

ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

అయితే ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇదే కాంబో లో పాన్ రాబోతున్న విషయం విదితమే.పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా జనగణమన సినిమా కూడా విజయ్ తోనే చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమా ప్రకటించారో లేదో సెట్స్ మీదకు తీసుకువెళ్లి ఫాస్ట్ గా పూర్తి చేయాలనీ పూరీ ప్లాన్ చేస్తున్నాడు.లైగర్ విషయంలో కరోనా కారణంగా ఆలస్యం అవ్వడంతో ఈ సినిమా మాత్రం రెండు మూడు నెలల్లోనే పూర్తి చేయడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు.

Telugu Puri Jagannath, Janaganamana, Pooja Hedge, Pooja Hegde Jgm-Movie

ఇక ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ బుట్టబొమ్మ హీరోయిన్ గా నటిస్తుంది అని కన్ఫర్మ్ చేసారు.నిన్ననే ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా జాయిన్ అయ్యింది.ఆ ఫోటోలు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.ప్రెసెంట్ చేతినిండా సినిమాలు ఉన్న ఈ బ్యూటీ ఈ సినిమాలో కూడా అవకాశం అందుకుని అందరిని ఆశ్చర్య పోయింది.

మొన్న శనివారం ఈ సినిమా షూటింగ్ ను ముంబై లో భారీ సెట్టింగ్ వేసిన సెట్ లో స్టార్ట్ చేసారు మేకర్స్.ఈ ఫస్ట్ షెడ్యూల్ లో పూజా కూడా పాల్గొంది.

ఈమె ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలు మాత్రమే చేసింది.ఇక ఇప్పుడు ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కు కూడా సై అంది.

ఇక ఈమె ఇందులో నటించేందుకు భారీ పారితోషికం అందుకుంటుంది అని వార్తలు వస్తున్నాయి.పూజా హెగ్డే ఈ సినిమాకు 45 రోజుల కాల్ షీట్స్ ఇచ్చిందట.అందుకు దాదాపు 4.5 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.ఈమె పాత్ర దృష్ట్యా ఈమెకు అంత మొత్తం ఇవ్వడానికి ఒప్పుకున్నారని టాక్ వినిపిస్తుంది.దేశభక్తి నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా పూరీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.వచ్చే ఏడాది ఆగస్టు 3న రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ కూడా చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube