బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss 7 ) ఉల్టా పుల్టా టాస్కులతో రసవత్తరంగానే సాగుతున్నట్టుగా కనిపిస్తోంది నిన్న మొన్నటి వరకు సోసో గా ఉన్న ఈ షో కాస్త పుంజుకుంటున్నట్టుగానే కనిపిస్తుంది రతిక ( Rathika ) ఎలిమినేషన్ తర్వాత అందరికీ ఎవరు ఏంటో కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు రెండు గ్రూపులుగా విడిపోయింది.ఒకటి సీరియల్ బ్యాచ్ అయితే మరొకటి శివాజీ( Shivaji ) గ్యాంగ్.
రతిక ఎలిమినేషన్ అవ్వడానికి కొన్ని రోజుల ముందు నుంచి ఈ రతిక జాగ్రత్తగా ఉండు నువ్వు సీరియల్ బ్యాచ్ తో చేరి కష్టపడతావ్ అని శివాజీ హెచ్చరించిన విషయం మనందరికీ తెలిసిందే.
అమర్ దీప్, ప్రియాంక, శోభ శెట్టి, సందీప్ ఒక గ్రూపుగా ఫామ్ అయి ఇంట్లో వాళ్ళని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేయాలని డిసైడ్ అయి వచ్చినట్టుగా తెలుస్తోంది వీటితో గౌతమ్ కూడా చేరిపోయాడు.
క్లారిటీ లేని ఆటతో ఎటువైపు ఉంటున్నాడో కూడా అర్థం కావడం లేదు.మరోవైపు శివాజీ తనకు తెలిసిన జ్ఞానాన్ని తన తోటి మిత్రులైన ప్రశాంత్,( Pallavi Prasanth ) యావర్( Yawar ) మరియు సబ్బు కి( Subbalaxmi ) చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.
వారికి అవసరమైన ప్రతిసారి నేనున్నాను అని ధైర్యం కూడా ఇస్తున్నాడు.
మొదట్లో బిగ్ బాస్ హౌస్ కి దత్తపుత్రుడిగా శివాజీని పోల్చిన వారంతా ప్రస్తుతం శివాజీ ప్రవర్తన చూసి నిజంగా మెచ్చుకుంటున్నారు.ఒక పెద్ద మనిషి తరహాని కొనసాగిస్తూనే తన ఆటను కూడా ఆడుకుంటూ అందరి చేత మన్ననలను పొందుతున్నాడు శివాజీ.ఇక మొట్టమొదటిగా ఈ షోలో బాగా నెగటివ్ పెంచుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం అమర్( Amar Deep ) మాత్రమే.
పల్లవి ప్రశాంత్ తో మొదటి నుంచి ఏదో రకంగా గొడవ పడుతూనే ఉన్నాడు.సానుభూతితో వచ్చి ఇక్కడ పెత్తనం చేయాలని చూస్తున్నాడు అంటూ అమర్ దీప్ మొదటి నుంచి చెప్తూనే శివాజీ బయాస్ గా ఆడాడు అని నామినేట్ కూడా చేశాడు.
శివాజీ బహిరంగంగానే ప్రశాంత్ మరియు యావర్ ను సపోర్ట్ చేస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ వారిని బాగా ఆడిస్తూ సీరియల్ బ్యాచ్ కి దొరకకుండా ఎక్కడా చిక్కకుండా తన తెలివినంత వాడి ఆటను కొనసాగేలా చేస్తున్నాడు.లేకపోతే ఇప్పటికే శివాజీ గ్యాంగ్ లో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయ్యేవారు.ఏది ఏమైనా శివాజీ ఆటలో మెచ్యూరిటీ కనిపిస్తోంది.ఒక్కో వారం దాటుతున్న కొద్ది ఆట కూడా మారుతూ వస్తోంది.