షారుఖ్ జవాన్.. డార్క్ మెన్ ని దించారంటూ కామెంట్స్..!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరక్టర్ అట్లీ డైరక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే.గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా జవాన్ అని ఫిక్స్ చేశారు.

 Sharukh Jawan First Look Copy To Hollywood Movie Darkman Details, Atlee, Darkman-TeluguStop.com

ఈమధ్యనే సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా వదిలారు.మొహం నిండా బ్యాండ్ లతో షారుఖ్ ఖాన్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది.

అయితే స్టార్ సినిమా పోస్టర్ నుంచి టీజర్ వరకు ఏది రిలీజైన ఇది ఏ సినిమాకు దగ్గరగా ఉందని చూడటం మన వాళ్లకు అలవాటే.లేటెస్ట్ గా జవాన్ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత నెటిజెన్లు 1990లో వచ్చిన డార్క్ మెన్ లోని లియాం నీసన్ లుక్ లానే షారుఖ్ ఖాన్ లుక్ ఉందని తేల్చి చెప్పేశారు.

ఒకవేళ జవాన్ ఆ సినిమాకు ఫ్రీమేకా అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు.డార్క్ మెన్ సినిమాను సాం రైమీ డైరెక్ట్ చేశారు.హాలీవుడ్ సినిమాల స్పూర్తితో చాలా ఇండియన్ సినిమాలు వచ్చాయి.అయితే జవాన్ కూడా అందులో ఒకటా కాదా అన్నది తెలియాల్సి ఉంది.

కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అవుతున్న షారుఖ్ ఖాన్ సౌత్ డైరక్టర్ అట్లీతో చేస్తున్న ఈ జవాన్ సినిమాతో మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు.ఈ జవాన్ కేవలం హిందీలోనే కాదు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా రిలీజ్ ప్లాన్ చేశారు.2023 జూన్ 3న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube