హెయిర్ క్రీమ్ బాక్సుల్లో ఫ్యాన్ బేరింగ్ లో బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలలో భాగంగా ఇద్దరు వేరు వేరు విమానాల్లో వచ్చిన ప్రయాణికుల వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారంను గుర్తించారు.అధికారులు శంషాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రతిరోజు తనిఖీలు చేస్తుండగా బంగారం పట్టుబడుతూనే ఉంది.

 Shamshabad Airport Customs Officers Caught Illegal Gold, Shamshabad Airport, Cus-TeluguStop.com

అధికారులు తమదైన నైపుణ్యత తో స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు.అయినా బంగారం తరలిస్తున్న నిందితులు తమ తీరు మార్చుకోకుండా రోజు మాదిరిగా వేరు వేరు మారు రూపాల్లో బంగారాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఫ్యాన్ బేరింగ్లో బంగారాన్ని దాచి తెచ్చిన ప్యాసింజరు శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్యాసింజర్ ఫ్యాన్ బేరింగ్లో బంగారాన్ని దాటే తెచ్చాడు.

స్కానింగ్లో గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.బేరింగ్లో దాచిన 636 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అదే విధంగా రియాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన మరో ప్యాసింజర్ నుంచి 5 గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరి నుంచి పట్టుబడ్డ బంగారం కిలో 218.6 గ్రాములు కాగా.దీని విలువ సుమారు 73 లక్షల 8 వేలు ఉంటుందని అధికారులు అంచనా చేశారు.

ఇద్దరిపై కస్టమ్స్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసిీ దర్యాప్తు చేపట్టారు.ఈరోజు కువూను కువైట్ నుండి వస్తున్న వ్యక్తి వడ్డ నుండి బంగారం దొరికింది.259 గ్రాముల విలువ రూ.15.76 లక్షలు, చెక్‌ఇన్ లగేజీలో హెయిర్ క్రీమ్ బాక్సుల్లో దాచిపెట్టి, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube