బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న షారుఖ్ ఖాన్ కొడుకు.. ఏ సినిమాతో అంటే?

బాలీవుడ్ బాద్ షా షారుఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇతని డ్రెస్ కేసు విషయంలో ఎన్సిబి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

 Sharukh Khan Son Entry In Bollywood Details, Bollywood Entry, Sharukh Khan, Ary-TeluguStop.com

అప్పట్లో ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది.ఈ క్రమంలోనే బాలీవుడ్లో పలువురు ప్రముఖులతో పాటు షారుఖ్ ఖాన్ అభిమానులు అతనికి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే తన కొడుకుని విడిపించడానికి షారుఖాన్ విశ్వప్రయత్నాలు చేశాడు.ఈ క్రమంలోనే కోర్టు మూడు సార్లు బెయిల్ నిరాకరించింది.

కానీ మొత్తానికి ఆర్యన్ ఖాన్ ఈ కేసు నుంచి బయట పడ్డాడు.

ఇటీవలే బెయిల్ పై బయటకు కూడా వచ్చేశాడు.

ఇదిలా ఉంటే బాలీవుడ్ కి ఆర్యన్ ఖాన్ ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఆర్యన్ ఖాన్ విదేశాల్లో అతడు ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించిన కోర్సులు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాకపోతే రాబోయే రోజుల్లో అతను విదేశాలకు ప్రయాణించే అవకాశం లేదు.బెయిల్ షరతుల్లో భాగంగా తన పాస్ పోర్ట్ ను కోర్టు ముందు సరెండర్ చేశాడు.

అయినప్పటికీ ఇండియా లో అతడు ఫిలిం మేకింగ్ ను నేర్చుకునే అవకాశం ఉంది.షారుక్ ఖాన్ కు యష్ రాజు ప్రొడక్షన్ తో పాటు ధర్నా ప్రొడక్షన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి.

దీనితో ఆ సంస్థలు నిర్మించే సినిమాలకు ఆర్యన్ ఖాన్ పని చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Aryan Khan, Aryankhan, Assistant, Bollywood, Drugs, Patan, Sharukh Khan,

గతంలో ఆర్యన్ ఖాన్ వై ఆర్ ఎఫ్ స్టూడియోస్ ను సందర్శించాడు.అలాగే తన తండ్రి షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న పటాన్ సినిమాలో పలు యాక్షన్ సన్నివేశాలకు అతడు సలహాలు సూచనలు అందించారు.కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న రాకి ఔర్ రాణికి ప్రేమ్ కహాని, తక్త్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆర్యన్ పని చేయబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ స్టార్ కిడ్స్ హీరో, హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇవ్వకముందు ఇతర ప్రాజెక్టుల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం అనేది సర్వసాధారణమైన విషయం.గతంలో రణ్ బీర్ కపూర్, వరుణ్ ధావన్, సిద్దార్థ్ మల్హోత్రా, శనయ కపూర్ తదితరులందరూ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube