శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.టైరు పేలి ఓ కారు డివైడర్ ను ఢీకొట్టింది.
ఈ ఘటన పర్వతదేవరపల్లి దగ్గర చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే స్పందించిన స్థానికులు చిన్నారులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.బెంగళూరు నుంచి వరంగల్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతుల వివరాలను సేకరిస్తున్నారు.