అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాటీ దగ్గర ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యి కాకినాడ డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు భద్రాచలం నుండి కాకినాడ వెళ్తుండగా మారేడుమిల్లి వాలమూరు సమీపంలో బ్రేకులు ఫెయిల్ అవటంతో ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో డ్రైవర్ సుబ్బారావు కు తీవ్ర గాయాలు కాగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
డ్రైవర్ సుబ్బారావు చాకచక్యంగా బస్సును అదుపు చేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు.క్షతగాత్రులను అంబులెన్స్ సహాయంతో మారేడుమిల్లి పిహెచ్సి తరలించి చికిత్స అందిస్తున్నారు.