గతంలో రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేసేవారు.కానీ ఇప్పుడు స్విగ్గీ, జొమాటో వచ్చి ఫుడ్ యాప్‌లకు ఆదరణ పెరిగింది.
దీంతో ఇంట్లోనే ఉంటూ ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు.అలాగే కొన్ని రెస్టారెంట్లు ఆర్డర్ పెడితే ఇంటికే ఫుడ్ డెలివరీ చేస్తుంటాయి.
అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టిన తర్వాత దాదాపు గంట వ్యవధిలో ఫుడ్ డెలివరీ అవ్వడం జరుగుతుంది.ఒక వేళ సాంకేతిక సమస్యలు తలెత్తడం, ఫుడ్ డెలివరీ సిబ్బంది కన్‌ఫ్యూజన్ వల్ల డెలివరీ లేట్ అయ్యే అవకాశం ఉంది.
ఇది చాలా రేర్ కేసుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి.
అయితే ఓ వ్యక్తి తను ఆర్డర్ చేసిన ఫుడ్ రాలేదని చిర్రెత్తిపోయాడు.
ఏకంగా రెస్టారెంట్‌కే బయర్దేరిపోయి నిప్పు పెట్టి పారిపోయాడు.దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.
ఈ ఘటన న్యూయార్క్ లో చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
చోఫెల్ నోర్బు (49 ఏళ్లు) అనే వ్యక్తి బంగ్లాదేశ్ రెస్టారెంట్‌లో చికెన్ ఆర్డర్ చేశాడు.అయితే ఏ కారణం వల్లనో సిబ్బంది అతడికి ఆర్డర్ సమయానికి ఇవ్వలేదు.
దీంతో కోపోధ్రిక్తుడైన చోఫెల్ రెస్టారెంట్‌కు వచ్చాడు. రెస్టారెంట్ గేట్ దగ్గర ద్రవాన్ని పోసి నిప్పు పెట్టాడు.ఈ క్రమంలో అతడికి బట్టలపై కూడా మంటలు వ్యాపించాయి.దీనికి సంబంధించిన వీడియో సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు సేకరించారు.రెస్టారెంట్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.దీనికి సంబంధించిన వీడియోను న్యూయార్క్ ఫైర్ సిబ్బంది సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
కొందరూ ఫన్నీగా రియాక్ట్ అయితే.మరికొందరు అతడిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులకు సలహా ఇస్తున్నారు.